ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: కార్తీక దీపోత్సవానికి 40 లక్షల మంది భక్తులు

ABN, Publish Date - Oct 24 , 2024 | 01:44 PM

తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే కార్తీక దీపోత్సవానికి ఈ యేడాది 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు రాష్ట్ర హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌ బాబు(Minister PK Shekhar Babu) తెలిపారు.

- మంత్రి పీకే శేఖర్‌బాబు అంచనా

- చిదంబరం ఆలయ దీక్షితుల చర్యలు కోర్టు దృష్టికి

చెన్నై: తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే కార్తీక దీపోత్సవానికి ఈ యేడాది 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు రాష్ట్ర హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌ బాబు(Minister PK Shekhar Babu) తెలిపారు. ప్యారీస్‏లోని కాళికాంబాల్‌ ఆలయం కోసం కొత్తగా తయారు చేస్తున్న వెండి రథం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ఆలయానికి కొత్త రథం నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఇపుడు వెండి రేకులను అమర్చుతున్నారని తెలిపారు. ఈ రథం వచ్చే యేడాది మార్చి నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Heavy rains: ఇంకా ముంపులోనే బెంగళూరు నగరం..!


గత యేడాది తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవానికి 30 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈ యేడాది ఈ సంఖ్య 40 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. వచ్చేవారందరికీ అవసరమైన ఏర్పాట్లతో పాటు సౌకర్యాలను కూడా కల్పిస్తామని వెల్లడించారు. చిదంబరం నటరాజస్వామి ఆలయం(Chidambaram Natarajaswamy Temple)లో దీక్షితుల చర్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఆలయం తమ సొంతమనేరీతిలో ఇష్టానుసారంగా కొత్త నిర్మాణాలు కూడా చేపట్టారన్నారు. అన్ని అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఇదిలా ఉండగా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి.. తాను చేసే వ్యాఖ్యలతో మీడియా తన దృష్టిని ఆకర్షించాలన్న ధోరణితో ఆయన వ్యవహారశైలి వుందన్నారు.


ఉత్తర చెన్నైలో 28 రకాల అభివృద్ధి పనులు

ఉత్తర చెన్నై అభివృద్ధి కోసం చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ కృతనిశ్చయంతో ఉన్నారన్నారన్నారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2023-24, 2024-25 సంవత్సరాల్లో ‘నార్త్‌ చెన్నై డెవపల్‌మెంట్‌ ప్రాజెక్టు’ పేరుతో ఏకంగా 140 రకాల అభివృద్ధి పనులను చేపట్టినట్టు తెలిపారు. ఇందుకోసం రూ.668 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి శేఖర్‌బాబు తెలిపారు.


ఇదికూడా చదవండి: చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఇదికూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

ఇదికూడా చదవండి: Bandi Sanjay: భయపెట్టాలని చూస్తే భయపడతామా?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2024 | 01:44 PM