ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Atishi : నీటి కొరతను 2 రోజుల్లో పరిష్కరించండి

ABN, Publish Date - Jun 20 , 2024 | 02:35 AM

ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని కేంద్రప్రభుత్వం రెండు రోజుల్లో పరిష్కరించాలని, లేకపోతే తాను శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఢిల్లీ తాగునీటి సరఫరా మంత్రి అతిశీ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

  • లేకపోతే నిరవధిక నిరాహార దీక్ష

  • ప్రధానికి ఢిల్లీ మంత్రి అతిశీ లేఖ

ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని కేంద్రప్రభుత్వం రెండు రోజుల్లో పరిష్కరించాలని, లేకపోతే తాను శుక్రవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ఢిల్లీ తాగునీటి సరఫరా మంత్రి అతిశీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను హరియాణా ప్రభుత్వం సక్రమంగా విడుదల చేయడం లేదని ఆమె ఆరోపించారు. ‘‘ఢిల్లీకి రోజుకు 613 మిలియన్‌ గ్యాలన్ల నీటిని విడుదల చేయాల్సి ఉండగా మంగళవారం హరియాణా ప్రభుత్వం కేవలం 513 గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేసింది. ఒక్కో మిలియన్‌ గ్యాలన్ల నీటిని 28,500 మంది వాడుకుంటారు. అంటే హరియాణా ప్రభుత్వం 28 లక్షల మందికి సరిపోయేంత నీటిని ఆపేసిందన్నమాట’’ అని వివరించారు.

Updated Date - Jun 20 , 2024 | 02:35 AM

Advertising
Advertising