ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: కేంద్ర చట్టాల్లో లోపాలు.. రాష్ట్ర వినతులను కేంద్రం పట్టించుకోలేదు

ABN, Publish Date - Jul 03 , 2024 | 12:38 PM

కేంద్రప్రభుత్వం అమలులోకి తెచ్చిన మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలు దేశవ్యాప్తంగా ప్రారంభమైన రోజే రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈనెల 15 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో మూడు కొత్త చట్టాల్లో సవరణలు తీసుకురానున్నట్లు రాష్ట్ర న్యాయ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌(Minister HK Patil) తెలిపారు.

- శాసనసభలో సవరణలు చేస్తాం..

- రాష్ట్ర న్యాయ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పాటిల్‌

బెంగళూరు: కేంద్రప్రభుత్వం అమలులోకి తెచ్చిన మూడు కొత్త క్రిమినల్‌ చట్టాలు దేశవ్యాప్తంగా ప్రారంభమైన రోజే రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈనెల 15 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో మూడు కొత్త చట్టాల్లో సవరణలు తీసుకురానున్నట్లు రాష్ట్ర న్యాయ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌(Minister HK Patil) తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ స్థానంలో కేంద్రప్రభుత్వం భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ చట్టాలు తీసుకొచ్చిందన్నారు. మూడు క్రిమినల్‌ చట్టాల్లో లోపాలు ఉన్నాయని, దేశంలో పోలీసు పాలన ప్రారంభమవుతుందని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ చట్టాలు స్వాతంత్య్ర పోరాట ఆశయాలు, ధ్యేయాలు, ప్రజాప్రభుత్వ విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.

ఇదికూడా చదవండి: BJP MLA: స్వామీజీలకు మరేమీ పనిలేదా..? ముఖ్యమంత్రుల మార్పు వారికెందుకు..?


కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గత ఏడాది ఆగస్టులోనే మూడు చట్టాలపై అభిప్రాయాలు కోరుతూ లేఖ రాశారని తెలిపారు. ముఖ్యమంత్రి సూచన మేరకు న్యాయనిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ నివేదికను న్యాయశాఖ పరిశీలన తర్వాత కేంద్రానికి పంపామని వివరించారు. రాష్ట్రం నుంచి అభిప్రాయాలు, మార్పులకు సంబంధించిన వినతులను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని అన్నారు. చట్టానికి సంబంధించి పలు అంశాలపై స్పష్టమైన వ్యాఖ్యానాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టం రూపొందించిన ప్రభుత్వం ఆ వ్యవధిలోనే అమలు చేసేందుకు నైతికత ఉంటుందని, ప్రభుత్వ గడువు ముగిశాక చట్టాలను అమలులోకి తెచ్చే తేదీలను నిర్ధారించడం అనైతిక, రాజకీయ వ్యతిరేక చర్య అవుతుందన్నారు. చట్టం చేసినప్పుడు ఉన్న ప్రభుత్వ గడువు లోక్‌సభ ఎన్నికల ముగియడంతోనే పూర్తి అయిందన్నారు. కొత్త ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత జూలై 1నుంచి చట్టాలను పరిగణనలోకి తీసుకోవాలనే సూచన సరికాదన్నారు. గురువారం జరిగే కేబినెట్‌లో వీటిపై చర్చిస్తామని అన్నారు. మూడు చట్టాలలోని 23 అంశాలను సవరణలు తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతామన్నారు. చట్ట సవరణలు చేసేందుకు రాష్ట్రానికి అధికారం ఉందని, రాజ్యాంగం ఆర్టికల్‌ 7 కాలం 3 ప్రకారం అధికారాన్ని ఉపయోగించి సవరణ చేస్తామన్నారు.


స్వాతంత్య్ర పోరాట విలువలకు స్వస్తి పలికారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం నేరమని కొత్త చట్టం చెబుతోందని మంత్రి పాటిల్‌ తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడం నేరం కాదనేది సరికాదని, జాతిపిత, జాతీయ పతాకాలకు అవమానం చేసేవారిపై చర్యలకు అవకాశం లేదనేది సరికాదని అన్నారు. సంఘటిత నేరాలు ఆరోపించే వ్యక్తులపై కేసులు నమోదును పోలీసుల వివేచనకు కేటాయించడం తగదన్నారు. నిందితుల ఆస్తులు జప్తు చేయడంపై పోలీసులకు అధికారం ఉంటుందని, ఇంతకుముందు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉండేదని వివరించారు. జాతీయ భావనలకు భంగం కలిగిస్తే మూడేళ్ల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరినామాగా విధించారని తెలిపారు. నిందితులు ఎవరైనా ప్రస్తుతం ఉన్న 15రోజుల పోలీస్‌ కస్టడీని 90రోజులకు పెంచారని పేర్కొన్నారు.


మృతదేహాలపై అత్యాచారం తప్పుకాదని న్యాయం చెబుతోందని వ్యాఖ్యానించారు. మూడు కొత్త చట్టాలు అమలులోకి రావడంతో అంతకుముందు నమోదైన కేసుల పరిష్కారం దాకా పాత చట్టాలకు అనుగుణంగా విచారణ జరిపి శిక్షలు విధిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సవరణల ప్రక్రియ ప్రారంభించి ఉభయసభలలో అంగీకారం సాధించి రాష్ట్రపతి నుంచి అనుమతులు పొందేవరకు కొత్తచట్టాలు రాష్ట్రంలో అమలులోకి రావని తెలిపారు. ఈ చట్టాల ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమని, కొన్ని రోజుల తర్వాత తెలుస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 12:38 PM

Advertising
Advertising