Minister: వచ్చే ఏడాది మదురై ఆలయ మహా కుంభాభిషేకం
ABN, Publish Date - Dec 10 , 2024 | 10:33 AM
మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చే ఏడాది డిసెంబర్‌లో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు హిందూ దేవాదాయ శాఖా మంత్రి పీకే శేఖర్ బాబు(Minister PK Shekhar Babu) పేర్కొన్నారు.
- మంత్రి పీకే శేఖర్ బాబు
చెన్నై: మదురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చే ఏడాది డిసెంబర్‌లో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు హిందూ దేవాదాయ శాఖా మంత్రి పీకే శేఖర్ బాబు(Minister PK Shekhar Babu) పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశంలో సోమవారం ఉదయం మాజీ మంత్రి సెల్లూర్ రాజు మదురై మహాకుంభాభిషేకం గురించి ప్రశ్నించగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ ప్రాంగణంలోని వీర వసంతరాయర్ మండపంలో 2018లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మండపం దెబ్బతిందని దీని పునఃరుద్ధరణకు 25 అడుగుల పొడవైన రాతి స్థంభాల తయారీకి ప్రభుత్వం నుంచి ఇటీవల అనుమతి వచ్చినట్లు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: BJP state president: టంగ్‌స్టన్ ప్రాజెక్ట్ లైసెన్స్ రద్దుపై కేంద్రం పరిశీలన
రాతి స్థంభాల కొనుగోలుకు సంబంధించి రూ.19 కోట్లతో టెండర్లు ఆహ్వానించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని మంత్రి శేఖర్ బాబు వివరించారు. మీనాక్షి(Meenakshi) అమ్మవారి ఆలయంలో చేపట్టిన జీర్ణోద్ధారణ పనులు ఇప్పటి వరకు 63 పూర్తయ్యాయని, వీటిలో 40 పనులు ఉభయదారుల ద్వారా నెరవేర్చినట్లు తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ అలయంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు దేవాదాయ శాఖా నిర్ణయించిందని మంత్రి పీకే శేఖర్ బాబు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం
ఈవార్తను కూడా చదవండి: Sangareddy: సోనియా,రాహుల్ ఇచ్చిన మాట తప్పరు
ఈవార్తను కూడా చదవండి: మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి
Read Latest Telangana News and National News
Updated Date - Dec 10 , 2024 | 10:33 AM