Minister: తేల్చిచెప్పేసిన మంత్రి.. ఇక ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను
ABN, Publish Date - Sep 15 , 2024 | 01:12 PM
ఇకపై ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేసేది లేదని మధుగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర సహకారశాఖ మంత్రి రాజణ్ణ(Minister Rajanna) వెల్లడించారు. తుమకూరులో మీడియాతో మాట్లాడుతూ... ఇకపై ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేసే ఆలోచన లేదన్నారు.
బెంగళూరు: ఇకపై ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేసేది లేదని మధుగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర సహకారశాఖ మంత్రి రాజణ్ణ(Minister Rajanna) వెల్లడించారు. తుమకూరులో మీడియాతో మాట్లాడుతూ... ఇకపై ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేసే ఆలోచన లేదన్నారు. ఎమ్మెల్యే(MLA)తోపాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానన్నారు. అయితే క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని, అవసరమైనవారిని గెలిపిస్తానన్నారు. నచ్చకుంటే ఓడించి తీరుతానన్నారు. మధుగిరిని(Madhugirini) జిల్లా కేంద్రం చేయాలనే ప్రయత్నం కొనసాగిస్తానన్నారు.
ఇదికూడా చదవండి: Aravind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం..
తన అధికారం ముగిసేలోగా మధుగిరిని జిల్లాను చేస్తానన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పనులు చేయడం లేదని, నియోజకవర్గ అభివృద్ధి తన ఆశయమన్నారు. మధుగిరి నుంచి 2023 ఎన్నికల్లో 91,166 ఓట్ల మెజారిటీతో జేడీఎస్‌కు చెందిన ఎంవీ వీరభద్రయ్యపై గెలుపు సాధించారు. 2018లో వీరభద్రయ్య చేతిలో ఓటమి చెందారు. రాజణ్ణ విలక్షణమైన రాజకీయ నాయకుడు. తప్పు ఎవరు చేసినా, ఎంతటివారైనా సొంత పార్టీలో అగ్రస్థానంలో ఉన్నా విమర్శలు చేస్తారు. ముక్కుసూటిగా మాట్లాడేతత్వం కలిగినవారు.
..............................................................
ఈ వార్తను కూడా చదవండి:
..................................................................
భారీగా పెరిగిన మల్లెపూల ధర.. కిలో ఎంతంటే...
చెన్నై: ఓనం పండుగ సందర్భంగా పూల ధరలు పెరిగాయి. కిలో మల్లెపూలు రూ.2,000కు విక్రయమవుతున్నాయి. పండుగ సందర్భంగా మలయాళీయులు పువ్వులతో వివిధ రకాల ముగ్గులు వేస్తుంటారు. దీంతో, తిరువనంతపురం (Thiruvananthapuram) చుట్టుపక్కల ప్రాంతాలకు కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లా దోవాలై నుంచి పూలు ఎగుమతి చేస్తుంటారు.
అలాగే, కేరళ(Kerala) వ్యాపారులు ఇక్కడికి నేరుగా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. దోవాలై పూల మార్కెట్(Dovalai Flower Market)కు ఇతర ప్రాంతాల నుంచి కూడా 150 నుంచి 200 టన్నుల పూలు దిగుమతి అవుతుంటాయి. వినియోగం పెరగడంతో శుక్రవారం 150 టన్నులు పూలు విక్రయమయ్యాయి. గరిష్ఠంగా కిలో మల్లెపూలు రూ.2,000, పిచ్చి పువ్వులు రూ.1,600కు విక్రయమయ్యాయి.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read LatestTelangana NewsandNational News
Updated Date - Sep 15 , 2024 | 01:12 PM