ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: విడతల వారీగా మద్యం దుకాణాల మూసివేత..

ABN, Publish Date - Sep 25 , 2024 | 01:00 PM

రాష్ట్రంలో విడతలవారీగా మద్యందుకాణాలు మూసివేసేలా చర్యలు చేపట్టనున్నామని గృహవసతి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి ఎస్‌. ముత్తుస్వామి(Minister S. Muthuswamy) తెలిపారు. మూసివేయనున్న టాస్మాక్‌ మద్యం దుకాణాల వివరాలు సేకరిస్తున్నామని, త్వరలో ఆ దుకాణాల జాబితా విడుదల చేస్తామని తెలిపారు.

- మంత్రి ముత్తుస్వామి

చెన్నై: రాష్ట్రంలో విడతలవారీగా మద్యందుకాణాలు మూసివేసేలా చర్యలు చేపట్టనున్నామని గృహవసతి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి ఎస్‌. ముత్తుస్వామి(Minister S. Muthuswamy) తెలిపారు. మూసివేయనున్న టాస్మాక్‌ మద్యం దుకాణాల వివరాలు సేకరిస్తున్నామని, త్వరలో ఆ దుకాణాల జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఈరోడ్‌ ముత్తపాళయం సమీపంలోని పెరుంపల్లం కాలువ పూడికతీత పనులను మంత్రి ముత్తుస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... టాస్మాక్‌ దుకాణాలు మూసివేసియడంపై తమకెలాంటి సూత్రప్రాయమైన విభేదాలు లేవన్నారు.ఒకేరోజు మద్యం దుకాణాలు మూసివేస్తే ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

ఇదికూడా చదవండి: వరుస రైలు ప్రమాదాల వేళ ‘రైల్‌ రక్షా దళ్‌’


ఒక ప్రాంతంలో మద్యం దుకాణం మూసేస్తే, అక్కడ ఏదైనా తప్పు జరుగుతుందా అనే విషయం పరిశీలించాల్సి ఉంటుందన్నారు. మద్యం దుకాణాలు మూసేస్తే ఆ ప్రాంతంలోని మద్యం ప్రియులు ప్రశాంతంగా ఉంటారని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. మద్యం దుకాణాలు మూసే సమయంలో, వారిని ఆ అలవాటు నుండి దూరం చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టాస్మాక్‌ దుకాణాలపై సర్వే చేస్తే, విక్రయాలు పెంచడమ కోసమేనని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.


టాస్మాక్‌ దుకాణాల్లో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నాయా, లేదా అనే విషయమై అధికారులు తనిఖీలు చేపడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడితే, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల మూసివేతకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని, త్వరలోనే మూసివేసే దుకాణాల జాబితా విడుదల చేస్తామని మంత్రి ముత్తుస్వామి స్పష్టం చేశారు.


..............................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.................................................................................

Chief Minister: త్వరలో మంత్రివర్గంలో మార్పులు..

- ఆశించేవారికి నిరాశ ఉండదు

- ముఖ్యమంత్రి స్టాలిన్‌ నర్మగర్భ వ్యాఖ్యలు

చెన్నై: త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. మంగళవారం ఉదయం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొళత్తూరు శాసనసభ నియోజకవర్గంలో కార్పొరేషన్‌, సీఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ... మంత్రివర్గంలో తప్పకుండా మార్పులు జరుగుతాయని, అవి ఎవరూ నిరాశచెందేలా ఉండవని స్పష్టం చేశారు.


మంత్రి ఉదయనిధికి డిప్యూటీ సీఎం కావటం ఖాయమంటూ మంత్రి వర్గ సహచరులు, పార్టీ నేతలు పదేపదే చెబుతున్న విషయాన్ని విలేఖరుల ఆయన దృష్టికి తీసుకెళ్లగా అందరూ ఆశించే విధంగానే మంత్రివర్గ మార్పులు జరుగుతాయంటూ, నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య రుతుపవన ప్రభావిత వర్షాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మురుగానందం జిల్లా కలెక్టర్లతో తరచూ వర్షం, వరద ముందస్తు జాగ్రతల విషయమై చర్చలు జరుపుతున్నారని, పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.


తనను శాసనసభ్యుడిగా ఎన్నుకున్న కొళత్తూరు ప్రజలు ఎల్లప్పుడూ తనపట్ల ఆదరాభిమానాలను ప్రదర్శిస్తున్నారని, అందుకే తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నానన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా విదేశీ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రధాన ప్రతిపక్ష నేత ఈపీఎస్‌ డిమాండ్‌ చేయడంపై ఆయన స్పందిస్తూ ఈ విషయమై పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా సమగ్రమైన వివరాలతో ప్రకటన చేశారని తెలిపారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో విదేశీ పెట్టుబడుల సమీకరణ ఎలా జరిగిందో ప్రజలందరికీ తెలిసేందేనని ఆయన ఎద్దేవా చేశారు.


ఇదికూడా చదవండి: మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు

ఇదికూడా చదవండి: రేవంత్‌రెడ్డి.. కోర్టుకు రండి!

ఇదికూడా చదవండి: తెలంగాణలో రేవంత్‌ కుటుంబం దోపిడీ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2024 | 01:00 PM