Minister: విద్యుత్ శాఖకు అదానీ సంస్థతో సంబంధాల్లేవు..
ABN, Publish Date - Nov 22 , 2024 | 12:42 PM
అదానీ సంస్థతో తమిళనాడు విద్యుత్ బోర్డుకు వ్యాపారరీత్యా మూడేళ్లుగా ఎలాంటి సంబంధాలు లేవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(Minister Senthil Balaji) పేర్కొన్నారు. అదానీ సంస్థతో టీఎన్‌ఈబీకి సంబంధాలున్నాయని సోషల్ మీడియాలో ప్రత్యేక కథనాలు వైరలవుతున్న నేపథ్యంలో, దీనిపై స్పందించిన మంత్రి సెంథిల్ బాలాజీ ఓ ప్రకటన విడుదల చేశారు.
- మంత్రి సెంథిల్ బాలాజి
చెన్నై: అదానీ సంస్థతో తమిళనాడు విద్యుత్ బోర్డు (Tamil Nadu Electricity Board)కి వ్యాపారరీత్యా మూడేళ్లుగా ఎలాంటి సంబంధాలు లేవని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(Minister Senthil Balaji) పేర్కొన్నారు. అదానీ సంస్థతో టీఎన్‌ఈబీకి సంబంధాలున్నాయని సోషల్ మీడియా(Social media)లో ప్రత్యేక కథనాలు వైరలవుతున్న నేపథ్యంలో, దీనిపై స్పందించిన మంత్రి సెంథిల్ బాలాజీ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యుత్ బోర్డు(Electricity Board)తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 1,500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Maoist Encounter:: భారీ ఎన్‌కౌంటర్.. మృతుల్లో అగ్రనేతలు
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(Solar Energy Corporation of India) కేంద్ర ప్రభుత్వ సంస్థ అని, ఆ సంస్థతోనే మిగతా రాష్ట్రాలు కూడా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంటున్నాయన్నారు. విద్యుత్ కొనుగోలుపై ఏవన్నా అనుమానాలుంటే వాటిని కూడా స్పష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య
ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..
ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్
Read Latest Telangana News and National News
Updated Date - Nov 22 , 2024 | 12:42 PM