Haryana: హర్యానాలోని నుహ్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్
ABN, Publish Date - Jul 21 , 2024 | 06:46 PM
హర్యానాలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రలో భాగంగా నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది...
హర్యానా, జులై 21: హర్యానాలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రలో భాగంగా నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇంటర్నెట్ సేవలు ఆదివారం సాయంత్రం 6.00 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.00 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర అడిషనల్ చీఫ్ సెక్రటరీ అనురాగ్ రస్తోగీ తెలిపారు.
Mamata Banerjee: బంగ్లా బాధితులకు ఆశ్రయం.. కీలక ప్రకటన
యాత్ర కొనసాగుతున్న వేళ.. సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అలాగే నుహ్ జిల్లాలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర శాంతియుతంగా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. అందుకోసం తగిన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.
Also Read: Vizianagaram: శ్రీ విద్యా పీఠంలో గురుపౌర్ణమి వేడుకలు
గతేడాది జులై 31న నుహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును ఆపందుకు పలువురు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతోపాటు కార్లను సైతం తగులబెట్టారు. ఈ హింసలో ఇద్దరు హోం గార్డులు మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పోలీసులు సైతం ఉన్నారు.
Also Read: Arvind Kejriwal: బీజేపీతోపాటు ఎల్జీపై మళ్లీ మండిపడ్డ ఆప్
ఇక అదే రోజు రాత్రి గుర్‌గ్రామ్‌లో మసీదుపై ఆగంతకులు దాడి చేసి.. ఇమాన్‌ను హత్య చేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న మత ఘర్షణలో అయిదుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది చోటు చేసుకున్న పరిస్థితులు పునరావృతం కాకుండా హర్యానా ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.
Also Read: New Delhi: జగన్ పాలనలో అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jul 21 , 2024 | 07:08 PM