ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DA Hike: మోదీ దీపావళి గిఫ్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

ABN, Publish Date - Oct 16 , 2024 | 03:15 PM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా 3 శాతం కరవు భత్యాన్ని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా 3 శాతం కరవు భత్యాన్ని (DA) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మూలవేతనంలో 50 శాతం ఉన్న డీఎం 53 శాతానికి చేరుతుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.

BREAKING: సీఈసీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్


కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో డీఏను 4 శాతం కేంద్రం పెంచింది. అది జనవరి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. మూడు నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. ఏటా ప్రభుత్వం రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను సవరిస్తుంటుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ కరవు భత్యాన్ని నిర్ణయిస్తారు. ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) ఆధారంగా డీఏ పెంపుదలను లెక్కిస్తారు.


For National News And Telugu News..

ఇది కూడా చదవండి..

Jammu and Kashmir: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. వారికి బయట నుంచే మద్దతు..

Updated Date - Oct 16 , 2024 | 03:19 PM