ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలుగు గొప్ప భాష: మోదీ

ABN, Publish Date - Aug 30 , 2024 | 04:13 AM

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు నాయకులు గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

  • తెలుగు వెలగాలి : ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి, న్యూఢిల్లీ, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు నాయకులు గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యవహారిక తెలుగు భాషకు గిడుగు వెంకట రామ్మూర్తి చేసిన విశేష సేవను పలువురు గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గురువారం ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో స్పందిస్తూ ‘తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది నిజంగా చాలా గొప్ప భాష, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌లో స్పందిస్తూ... ‘తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయులను నేడు తలుచుకోవడం ద్వారా అమ్మ భాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుదాం. వారి అడుగుజాడల్లో నడస్తూ, మన భాషను సుసంపన్నం చేసుకుందాం. తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బృహత్‌ బాధ్యతని మనం తీసుకుందాం. అదే వారికి మనమిచ్చే ఘన నివాళి. తెలుగు వెలగాలి.. తెలుగు భాష వర్ధిల్లాలి అని కోరుకుంటూ దాని కోసం పని చేద్దాం’ అని పిలుపునిచ్చారు.

Updated Date - Aug 30 , 2024 | 04:13 AM

Advertising
Advertising