ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: నెహ్రూ రికార్డుపై మోదీ కన్ను.. చరిత్ర సృష్టిస్తారా?

ABN, Publish Date - Jun 04 , 2024 | 07:51 AM

లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వేళ.. అందరి చూపు బీజేపీపై పడింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా.. అలా జరిగితే మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చరిత్రను ప్రధాని మోదీ తిరగరాస్తారు.

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న వేళ.. అందరి చూపు బీజేపీపై పడింది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా.. అలా జరిగితే మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చరిత్రను ప్రధాని మోదీ తిరగరాస్తారు. అయితే దేశవ్యాప్తంగా తమ ప్రభావం తగ్గినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నాయి.

ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వరసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమం చేస్తారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో అధికారంలో ఉన్న వైకాపా, బీజేడీ భవితవ్యం తేలిపోనుంది.


భద్రత బలగాల పటిష్ట పహారా..

ఉదయం 8గంటల నుంచే సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు చేపడతారు. తొలి అరగంటలో పోస్టల్ బ్యాలెట్లు, అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నేరుగా ఈవీఎంలలో పోలైన ఓట్లనే లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలతో పాటు ఆయా రాష్ట్రాల పోలీసులను మోహరించారు. ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తారు. దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తర్‌ ప్రదేశ్‌లో 75 జిల్లా‌లోని 81 లెక్కింపు కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు. మహారాష్ట్రలో 48లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, 289 కౌంటింగ్ హాళ్లు, 4 వేల 309 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 14 వేల 507 మంది సిబ్బంది ఓట్లు లెక్కిస్తారని అధికారులు వివరించారు.


తమిళనాడులోని 39 లోక్‌సభ సీట్లకు పోలైన ఓట్లను 39 కేంద్రాల్లో లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. మధ్యప్రదేశ్‌లోని 29 స్థానాలకు 52 జిల్లాల్లో కౌంటింగ్‌కు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. కర్ణాటకలోని 28 లోక్‌సభ సీట్లకు పోలైన ఓట్లను 29 కేంద్రాల్లో లెక్కించనున్నారు. 13 వేల మంది సిబ్బంది పాల్గొనున్నారు. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవం కావడం వల్ల 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 26 కేంద్రాల్లో ఓట్లు గణించనున్నారు. కేరళలోని 20 లోక్‌సభ స్థానాల ఓట్లను 20 కేంద్రాల్లో లెక్కించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అసోంలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల ఓట్లను 52 కేంద్రాల్లో లెక్కించనున్నారు. పంజాబ్‌లో 13 లోక్‌సభ స్థానాల ఓట్లను లెక్కించేందుకు 27 ప్రాంతాల్లోని 48 భవనాల్లో 117 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు హ్యాట్రిక్‌పై కన్నేసిన ప్రధాని మోదీ.. మరోవైపు 295 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఇండియా కూటమి నేతలు ధీమాగా ఉన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 07:51 AM

Advertising
Advertising