ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Monkeypox: పాకిస్థాన్‌ను తాకిన మంకీపాక్స్.. ఇండియాలో కూడా వ్యాపిస్తుందా, దీని లక్షణాలేంటి?

ABN, Publish Date - Aug 19 , 2024 | 06:46 AM

మంకీపాక్స్‌(Monkeypox) వైరస్‌ భారత్‌ పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు చేరింది. దీంతో ఇండియా(india)లో ఉన్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, ఎలా వ్యాపిస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

monkeypox symptoms

మంకీపాక్స్‌(Monkeypox) వైరస్‌ భారత్‌ పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు చేరింది. దీంతో ఇండియా(india)లో ఉన్న ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. మరోవైపు WHO కూడా మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. దీంతో పాటు అన్ని దేశాలు కూడా ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు వేకంగా పెరుగుతున్నాయి. 30 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 500 మందికి పైగా రోగులు మరణించారు.

ఇది రెండోసారి

దక్షిణాఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా ఈ కేసులు రికార్డయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. ఇంతకుముందు ఈ ప్రకటన 2022లో చేయబడింది. ఆ సమయంలో ఈ వైరస్ ప్రపంచంలోని 116 దేశాలలో వ్యాపించింది. అప్పుడు దాదాపు 1 లక్ష కేసులు నమోదుకాగా, ఆ సమయంలో ఈ వ్యాధి భారతదేశంలో కూడా వ్యాపించింది. అప్పుడు ఇండియాలో 30 కేసులను గుర్తించారు.


సరిహద్దుల్లో

ఈ క్రమంలో దేశంలోని అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దు ఎంట్రీ పాయింట్లలోని ఆరోగ్య విభాగాలను కేంద్ర ఆరోగ్య మంత్రి JP నడ్డా అప్రమత్తం చేశారు. ఆయా ప్రాంతాల్లో పరీక్షా ల్యాబ్‌లను సిద్ధం చేయాలని, ఏదైనా కేసు వస్తే వెంటనే గుర్తించి తెలియజేయాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా, నియంత్రించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది.

ఆఫ్రికాలో కేసులు నమోదైనప్పటికీ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. మంకీపాక్స్ ఒక అంటు వైరస్. ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక భారతదేశానికి సంబంధించినంత వరకు ఇక్కడ కోతుల ప్రభావం ఎలా ఉంటుందోనని స్పష్టంగా చెప్పలేము. ఎందుకంటే గతసారి కూడా చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి.


మంకీపాక్స్ లక్షణాలు ఏంటి?

మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ సాధారణంగా 2-4 వారాల పాటు ఉంటుందని, సపోర్టివ్ మేనేజ్‌మెంట్‌తో రోగులు కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశంలో వెల్లడైంది. అలైంగిక సంపర్కం, గాయ పడిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం లేదా సోకిన వ్యక్తి దుస్తులు లేదా బెడ్‌షీట్‌లను ఉపయోగించడం ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.

  • వాపు శోషరస కణుపులు

  • జ్వరం

  • చలిగా అనిపించడం

  • కండరాల నొప్పి

  • తలనొప్పి

  • అలసట


మంకీపాక్స్ చికిత్స ఎలా ?

Mpox చాలా సందర్భాలలో దానంతటదే తగ్గుతుంది. కానీ కొందరిలో ఇది తీవ్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదా సూచించిన మందులు లేవు. రోగికి అతని లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స చేస్తారు. వైద్యులు యాంటీవైరల్ మందులు ఇవ్వడం ద్వారా రోగి వ్యాధిని నియంత్రిస్తారు.


ఇవి కూడా చదవండి:

Supreme Court : కోల్‌కతా హత్యాచారంపై సుప్రీంకోర్టు విచారణ


TMC : టీఎంసీలో చిచ్చు!


Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 19 , 2024 | 06:48 AM

Advertising
Advertising
<