Uttarpradesh: 6 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం.. కోతుల రాకతో నిందితుడి పరార్!
ABN, Publish Date - Sep 23 , 2024 | 08:12 PM
అఘాయిత్యానికి పాల్పడబోతున్న నిందితుడి నుంచి ఓ ఆరేళ్ల బాలికను కోతుల మంద కాపాడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: అఘాయిత్యానికి ప్రయత్నించిన నిందితుడి నుంచి ఓ ఆరేళ్ల బాలికను కోతుల మంద కాపాడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల వెలుగు చూసింది. భాగ్‌పత్ జిల్లాలోని దౌలా గ్రామంలో సెప్టెంబర్ 20న ఈ ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు (Uttarpradesh).
Coldplay: కోల్డ్‌ప్లే కాన్సర్ట్.. బుక్‌మైషో వెబ్‌సైట్ క్రాష్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తన ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని నిందితుడు ఓ నిర్మానుష్య భవంతిలోకి తీసుకెళ్లాడు. ఆమె దుస్తులు తొలగించి దారుణానికి పాల్పడబోతుండగా ఎక్కడి నుంచో కోతుల మంద అకస్మాత్తుగా భవనం లోకి వచ్చింది. కోతులు నిందితుడిపై దాడి చేయబోయాయి. అన్ని కోతులను చూసేసరికి బెదిరిపోయిన నిందితుడు చిన్నారిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. అనంతరం, ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
APY: దాదాపు 7 కోట్లకు చేరిన అటల్ పెన్షన్ యోజన సబ్‌స్క్రైబర్ల సంఖ్య
కాగా, నిందితుడు బాలికను తీసుకెళుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను నిందితుడు మాయమాటలు చెప్పి ఓ మతపరమైన భవంతికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి పాడుపడిన ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టబోయాడు. ఎదురుచెబితే తనను తన కుటుంబ సభ్యులను కూడా చంపేస్తానని నిందితుడు బెదిరించినట్టు బాలిక పేర్కొంది.
ఇక చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Updated Date - Sep 23 , 2024 | 08:17 PM