ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MP Kanimozhi: పీఎంగారూ.. బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షల కోసం ఎదురుచూస్తున్నాం..

ABN, Publish Date - Feb 25 , 2024 | 12:42 PM

ప్రతి ఒక్కరి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న ప్రధాని మోదీ ఎన్నికల హామీ కోసం ఎదురుచూస్తున్నామని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఛలోక్తి విసిరారు.

- డీఎంకే ఎంపీ కనిమొళి

చెన్నై: ప్రతి ఒక్కరి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్న ప్రధాని మోదీ ఎన్నికల హామీ కోసం ఎదురుచూస్తున్నామని డీఎంకే ఎంపీ కనిమొళి(MP Kanimozhi) ఛలోక్తి విసిరారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ప్రకటనలో, డీఎంకే నియమించిన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఈ నెల 5వ తేది నుంచి అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, దివ్యాంగులు సహా అన్ని వర్గాల వారిని సంప్రదించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నామన్నారు. అలా సేకరించిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన అనంతరం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని, ప్రజల అభిప్రాయాలే డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోగా ఉంటుందన్నారు. డీఎంకే ఎన్నికల హామీలు నెరవేర్చలేదని బీజేపీ నేత అన్నామలై విమర్శిస్తున్నారని, ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరి బ్యాంక్‌ ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామని ప్రధాని మోదీ హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. మరోవైపు డీఎంకే అబద్ధపు వాగ్దానాలు చేస్తోందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పేర్కొంటున్నారని, అన్నాడీఎంకే పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందనే విషయాన్ని ఆయన గుర్తుచేసుకోవాలని కనిమొళి సూచించారు.

Updated Date - Feb 25 , 2024 | 12:42 PM

Advertising
Advertising