ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Actor Govinda: నటుడు గోవిందను కలిసిన క్రైం బ్రాంచ్ అధికారులు

ABN, Publish Date - Oct 02 , 2024 | 03:29 PM

వెబ్‌లే కంపెనీకి చెందిన తుపాకీ పేలడంతో బుల్లెట్ ఎడమకాలి మోకాలు కింద తగిలిందని, అది చాలా పాత తుపాకీ అని, లాక్ చేయకపోవడంతో మిస్‌ఫైర్ అయిందని గోవింద తెలిపారు.

ముంబై: లైసెన్స్‌డ్ రివాల్వర్ పేలి ఎడమ కాలికి బుల్లెట్ గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటుడు గోవింద (Govinda)ను ముంబై క్రైం బ్రాంచ్ అధికారులు బుధవారంనాడు కలుసుకున్నారు. ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టగా, ముంబై క్రైం బ్రాంచ్ సైతం సమాంతర విచారణ జరుపుతోంది. ఇంతవరకూ ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ముంబైలోని తన నివాసంలో గోవిందా తెల్లవారుజామున తుపాకీ పేలి గాయపడ్డారు. ఒక షో నిమిత్తం కోల్‌కతా విమానాశ్రయానికి వెళ్లే హడావిడిలో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తూ బుల్లెట్ పేలి ఆయన ఎడమకాలి మోకాలి కింద తగిలింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారు.

Nitin Gadkari: గుట్కా తిని రోడ్డుమీద ఉమ్మేసే వాళ్లను ఇలా కట్టడి చేయొచ్చు... చిట్కా చెప్పిన గడ్కరి


ఈ ఘటన నేపథ్యంలో సీనియర్ పోలీసు అధికారి దయా నాయక్ సారథ్యంలోని క్రైం బ్రాంచ్ టీమ్ గోవిందాను ఆసుపత్రిలో కలుసుకుంది. ఘటనపై గోవిందాను అధికారులు ప్రశ్నించారు. మంగళవారం ఉదయం తుపాకీ పేలినట్టు గోవిందా తెలిపారు. వెబ్‌లే కంపెనీకి చెందిన తుపాకీ పేలడంతో బుల్లెట్ ఎడమకాలి మోకాలు కింద తగిలింది. అది చాలా పాత తుపాకీ అని, లాక్ చేయకపోవడంతో మిస్‌ఫైర్ అయిందని గోవింద తెలిపారు. తదుపరి దర్యాప్తు కోసం రివాల్వర్‌ను పోలీసు అధికారులు సీజ్ చేశారు.


కోలుకుంటున్నారు: సునీత

గోవింద ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టు ఆయన భార్య సునీత బుధవారం ఉదయం తెలిపారు. రెండ్రోజుల్లో డిశ్చార్ అవుతారని చెప్పారు. ఈరోజు నార్మల్ వార్డులోకి మార్చినట్టు వివరించారు. అభిమానులు, భగవంతుడి ఆశీస్సులతో గోవిందా కోలుకుంటున్నారని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆమె కోరారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం

Haryana Polls: హరియాణా బీజేపీ.. ముచ్చటగా మూడోసారికి, ఆ మూడే కీలకం

Varanasi: ఆలయాల వద్ద ఉద్రిక్తత.. సాయిబాబా విగ్రహాల తొలగింపు

Updated Date - Oct 02 , 2024 | 03:29 PM