Ayodhya: రామ్‌లల్లా పూజకు పువ్వులు అందజేస్తున్న ముస్లిం కుటుంబం
ABN, Publish Date - Jan 16 , 2024 | 02:44 PM
అయోధ్యలో రామ్‌లల్లా (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. అయోధ్య అంతా రామనామ స్మరణతో మారుమోగుతుంది. అయోధ్యలో (Ayodhya) గల హనుమాన్ ఆలయాల్లో సుందరకాండ పఠించడంతో అక్కడికి భారీగా భక్తులు చేరుకున్నారు.
అయోధ్య: అయోధ్యలో రామ్‌లల్లా (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. అయోధ్య అంతా రామనామ స్మరణతో మారుమోగుతుంది. అయోధ్యలో (Ayodhya) గల హనుమాన్ ఆలయాల్లో సుందరకాండ పఠించడంతో అక్కడికి భారీగా భక్తులు చేరుకున్నారు.
బాలా రాముడి కోసం పూలను ముస్లిం కుటుంబం (Muslim Family) అందజేయనుంది. అయోధ్యలో భారీ పూల తోట ఉన్న మహ్మద్ అనిస్ ( Mohammad Anees) పూలు సమర్పిస్తారు. రామ్‌లల్లాకు పువ్వుల అందజేయడం పట్ల అనీస్ సంతోషం వ్యక్తం చేశారు. గత ఐదు తరాల నుంచి అనిస్ కుటుంబం రామ్ లల్లా, హనుమాన్ గర్హి, అయోధ్యలో గత ఇతర ఆలయాలకు పువ్వులను ఇస్తున్నారు.
అయోధ్యలో తాము అంతా సామరస్యంగా ఉంటామని అనిస్ చెబుతున్నారు. తమ మధ్య విభేదాలు లేవని స్పష్టంచేశారు. తన తోటలోని గులాబీలను 22వ తేదీన రామ్‌లల్లాకు సమర్పించడం సంతోషంగా ఉందని అంటున్నారు. అయోధ్యలో భక్తిని చాటి, ఐక్యతను చూపి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 16 , 2024 | 02:44 PM