ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: జైళ్లో ఖైదీలకు మటన్ బిర్యానీ, బసంతీ పులావ్

ABN, Publish Date - Oct 06 , 2024 | 07:22 AM

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) కీలక నిర్ణయం తీసుకుంది. జైలులో ఉన్న ఖైదీలకు సర్కార్ దసరా సందర్భంగా శుభవార్త చెప్పింది.

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) కీలక నిర్ణయం తీసుకున్నారు. జైలులో ఉన్న ఖైదీలకు సర్కార్ దసరా సందర్భంగా శుభవార్త చెప్పారు. కుటుంబానికి దూరమైన దాదాపు 28 వేల మంది ఖైదీలకు ఈ దసరాకు పసందైన వంటకాలతో భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే చికెన్, మటన్, చేపలు సహా అన్ని రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను లంచ్, డిన్నర్ మెనూలో చేర్చనున్నట్లు వెల్లడించారు. ఖైదీల్లో సత్ర్పవర్తన తీసుకువచ్చేందుకు దుర్గా పూజల వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్లల్లో ఈ వంటకాలను వడ్డించనున్నారు. మెనూలో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బసంతి పులావ్, మాచెర్ మాతా దియే పుయ్ షాక్ (చేప తలతో కూడిన మలబార్ బచ్చలికూర), మాచెర్ మాతా దియే దాల్ (చేప తలతో పప్పు) తదితర వంటకాలు వడ్డించనున్నారు. ఓ వైపు వారిలో మార్పు రావడంతోపాటు.. పండగను కుటుంబానితో కలిసి చేసుకోలేకపోయామనే బాధనుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెప్పారు.


ఈ ఆహార పదార్థాలన్నీ జైలులో ఉండే ఖైదీలతోనే తయారు చేయించనున్నట్లు తెలుస్తోంది. వంటకాలను ఖైదీలతో పాటు రిమాండ్ ఖైదీలకు కూడా అందిస్తారు. షష్టి నుంచి దశమి వరకు లంచ్, డిన్నర్ మెనూ అమల్లో ఉంటుంది. ఇక దుర్గాపూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతీ సంవత్సరం మంచి ఆహారాన్ని అందిస్తామని జైలు అధికారులు వెల్లడించారు. ఖైదీల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. వారి ముఖాల్లో చిరునవ్వు తెసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

వంటకాల్లో ఇంకా..

లూచీ చోలార్ దాల్, పాయేష్, చికెన్ కర్రీ, మాచర్ మాతా దియే పుయ్ షక్, పొటోల్ చింగ్రీ, మటన్ బిర్యానీ విత్ రైతా, మాచెర్ మాతా దియే దాల్, ఆలు, బసంతి పులావ్ అందిస్తారు. అయితే ఎవరికి నచ్చిన ఆహారం వారు తీసుకోవచ్చని జైలు అధికారులు వెల్లడించారు.

Gold Prices: బంగారం ధరలకు కళ్లెం.. ఇవాళ ఎంత పలుకుతోందంటే

Today Horoscope : ఈ రాశి వారికి ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి.

కుర్రాళ్లకు సువర్ణావకాశం

For Latest News and Business News click here

Updated Date - Oct 06 , 2024 | 08:35 AM