ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎంవీఏ ‘మహా’పతనం!

ABN, Publish Date - Nov 24 , 2024 | 04:03 AM

మహా వికాస్‌ ఆఘాఢీ.. మహారాష్ట్రలో 2019 ఎన్నికల తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఎంవీఏ కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్‌, శివసేన(ఉద్ధవ్‌), ఎన్సీపీ(శరద్‌పవార్‌) పార్టీలు అధికారాన్ని చేపట్టాయి..

కాంగ్రె్‌సకు కోలుకోలేని దెబ్బ??

గుర్తులు మారి బోల్తాపడ్డ ఉద్దవ్‌, శరద్‌పవార్‌!

మహా వికాస్‌ ఆఘాఢీ.. మహారాష్ట్రలో 2019 ఎన్నికల తర్వాత అనూహ్య పరిస్థితుల్లో ఎంవీఏ కూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్‌, శివసేన(ఉద్ధవ్‌), ఎన్సీపీ(శరద్‌పవార్‌) పార్టీలు అధికారాన్ని చేపట్టాయి..! ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ మహారాష్ట్రలో ఎన్డీయేకు ఝలక్‌ ఇచ్చిన ఈ కూటమి.. ఆర్నెల్లలో చతికిలపడిపోయింది..! తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడా.. అక్కడా అని కాకుండా.. కొంకణ్‌ మొదలు మారాఠ్వాడ దాకా.. అంతటా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి ప్రభావం కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి భవితవ్యం, ఉద్ధవ్‌ఠాక్రే, శరద్‌పవార్‌ పార్టీల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఎంవీఏలో సిద్ధాంతపర విభేదాలు లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే బయటపడ్డాయి. ఆ తర్వాత కూడా.. వీర సావర్కార్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. దాన్ని ఉద్ధవ్‌ఠాక్రే ఖండించడం.. ఆ తర్వాత వెనక్కి తగ్గినా.. నష్టనివారణకు కూటమి ప్రయత్నించిన దాఖలాలు మాత్రం అంతంత మాత్రమే..! అడపాదడపా శరద్‌పవార్‌, ఉద్ధవ్‌ఠాక్రే వేర్వేరుగా కాంగ్రె్‌సను విమర్శించారు. అదానీని కాంగ్రెస్‌ పదేపదే టార్గెట్‌గా చేసుకోవడాన్ని శరద్‌పవార్‌ తప్పుబట్టారు. అంతేకాదు.. బాల్‌ఠాక్రే హయాంలో శివసేన అంటే హిందూత్వ అనేలా పరిస్థితులుండేవి. అయితే.. ఉద్ధవ్‌ఠాక్రే తమ సిద్ధాంతాలకు వ్యతిరేకమైన కాంగ్రెస్‌ పంచన చేరడం.. తమదే అసలైన శివసేన అంటూ శిందే వర్గం పదేపదే ప్రకటనలు చేయడం ఎంవీఏకు నష్టాన్ని కలిగించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెబెల్స్‌ వల్ల ఎంవీఏ ఓట్ల బదిలీ జరిగి ఎంవీఏ కూటమికి నష్టం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గుర్తులు మారి..

బాలాసాహెబ్‌(బాల్‌ఠాక్రే) పేరుతో ముందుకు దూసుకెళ్లే శివసేన(ఉద్ధవ్‌) పార్టీ.. ఈ సారి సొంత గుర్తు లేక.. ప్రజల్లోకి తమదే అసలైన శివసేన అని చెప్పడంలో విఫలమైంది. అదే సమయంలో శిందే వర్గం ఈ విషయంలో ముందంజలో ఉండి.. బాలాసాహెబ్‌ ఆశయాలను సాధించేది తామేనని చాటింది. అటు శరద్‌పవార్‌ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. గడియారం గుర్తు అజిత్‌వర్గానికి వెళ్లడంతో.. స్వయంగా శరద్‌పవార్‌ ముందుండి ప్రచారం చేసినా.. ఫలితం లేకుండా పోయింది.

ప్రణాళిక అద్భుతంగా ఉన్నా..

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి, ఎంవీఏ కూటములు ప్రజలపై వరాల జల్లులు కురిపించాయి. అయితే.. ఎన్నికల ప్రణాళికను ఓటర్లలోకి తీసుకెళ్లడంలో మహాయుతి విజయవంతమైనట్లు తాజా ఫలితాలు చెబుతున్నాయి. కాగా, తాజా ఎన్నికల్లో భాగంగా నాందేడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. దీంతో.. తన సిటింగ్‌ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ బలం లోక్‌సభలో 99 నుంచి 98కి పడిపోయింది. తాజా అపజయంతో భవిష్యత్‌లో పెద్ద సంఖ్యలో రాజ్యసభ సీట్లను కూడా ఎంవీఏ/ఇండియా కూటమి కోల్పోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Nov 24 , 2024 | 04:04 AM