ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ప్రమాదకర స్టంట్ చేస్తూ అనంతలోకాలకి.. ఒళ్లు గగుర్పొడుస్తున్న వీడియో

ABN, Publish Date - Aug 16 , 2024 | 03:38 PM

యువత రిస్కీ స్టంట్స్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలను ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో మరోటి జరిగింది.

ఇంటర్నెట్ డెస్క్: యువత రిస్కీ స్టంట్స్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలను ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి జలాశయం వద్దకు వెళ్లి.. రిస్కీ స్టంట్స్‌ చేసి ప్రాణాలే కోల్పోయాడు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు స్నేహితులు టూర్ కోసం ప్లాన్ వేసుకున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నాగ్‌పుర్‌లోని ఉమ్రేడ్‌ పట్టణం సమీపంలో ఉన్న మకర్‌ధోక్డా డ్యామ్ ఓ పక్కన అలుగు పారుతోంది. దీంతో స్నేహితులంతా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఆగస్టు 15న అక్కడికి చేరుకున్నారు. అనంతరం అలుగుపారుతున్న డ్యామ్ కట్టపైకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు.

ఒకరి సాయంతో ఒకరు పైకి పాకుతుంటారు. వారిలో ఒకరు పైకి చేరుకుని విజయ సంకేతం ఇస్తాడు. అనంతరం అతను మరో స్నేహితుడిని కూడా పైకి లాగాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో రెండో స్నేహితుడి చేతిని పట్టుకోగా, అతడు జారిపోయాడు. మిగతా ఇద్దరు కిందకి జారిపోగా.. చేయందించిన యువకుడు డ్యాంలోకి పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో పైకి రావాలని చాలా సేపు పోరాడాడు. అతన్ని గమనించిన స్థానికులు బయటకి తీద్దామనుకునేలోపే పూర్తిగా నీటిలో మునిగిపోతాడు. దీంతో స్థానిక టూరిస్టు ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సరదాపడి చేసిన స్టంట్ ప్రాణాల మీదకి రావడంతో.. బాధితుడి స్నేహితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. యువకుడు మునిగిపోతున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియోలు తీశారు. అవి నెట్టింట వైరల్‌గా మారాయి. గజఈతగాళ్ల సాయంతో అతని మృతదేహాన్ని బయటకి తీశారు.


తరచూ ప్రమాదాలు..

చిన్న సరదా కోసం, వైరల్ కావడం కోసం ఇటీవల యువత ఇలాంటి రిస్కీ స్టంట్లు చూస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఓ మహిళ యూట్యూబర్ కొండ అంచున నిలబడి వ్లాగ్ తీస్తుండగా.. లోయలోకి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరో మహిళ టూరిస్టు ప్రాంతానికి వెళ్లి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో అధికారులు ఆమెను క్షేమంగా బయటకి తీసుకొచ్చారు. ఇలాంటివి నిత్యం కోకొల్లలు. ఇప్పటికైనా పర్యాటక శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 16 , 2024 | 03:38 PM

Advertising
Advertising
<