Delhi : అదిరేటి డ్రెస్సు మీరేస్తే..!
ABN, Publish Date - Jul 23 , 2024 | 05:14 AM
నరేంద్ర మోదీ, జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, బరాక్ ఒబామా.. వీళ్లంతా ప్రపంచస్థాయి నాయకులు. నిత్యం సంప్రదాయ దుస్తులతో దర్శనమిస్తూ ఉంటారు. వీళ్లంతా ఒకరోజు ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. ఒకే వేదికపై అదిరేటి డ్రెస్సులతో ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది..?
మోదీ, బైడెన్, ట్రంప్, పుతిన్ ర్యాంప్ వాక్.. ఏఐ వీడియోను విడుదల చేసిన ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ, జూలై 22: నరేంద్ర మోదీ, జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్, బరాక్ ఒబామా.. వీళ్లంతా ప్రపంచస్థాయి నాయకులు. నిత్యం సంప్రదాయ దుస్తులతో దర్శనమిస్తూ ఉంటారు. వీళ్లంతా ఒకరోజు ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. ఒకే వేదికపై అదిరేటి డ్రెస్సులతో ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది..? ఈ చిత్రాన్ని కలలో కూడా ఊహించలేం కదా..! అయితే.. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఈ కాల్పనిక దృశ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా సృష్టించారు. ఏఐకి ఫ్యాషన్‌ను మేళవిస్తూ అగ్రస్థాయి నేతలకు కొత్త కొత్త మోడల్ డ్రెస్సులు తొడిగి.. వాళ్లతో ర్యాంప్ వాక్ చేయించారు.
ఈ వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసి ‘ఫ్యాషన్ షోకు వేళయింది’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో భారత ప్రధాని మోదీ.. ఒంటినిండా రంగురంగుల దుస్తులు, నల్ల కళ్లద్దాలు, నుదుటిన బొట్టుతో స్టైల్‌గా వాకింగ్ చేస్తూ కనిపించారు. అమెరికా సైనిక దుస్తుల్లో ఉన్న బైడెన్‌ను వీల్‌చైర్‌లో వస్తున్నట్టు చూపించారు. ఖైదీలు ధరించే డ్రెస్, చేతిలో బేడీలు, సీరియస్ లుక్‌తో ట్రంప్ ర్యాంప్‌పై నడిచారు.
మస్క్ కూడా టెస్లా, ఎక్స్ థీమ్‌లో ఉన్న స్పేస్ సూట్‌లో సూపర్ హీరోలా కనిపించారు. ఇంకా.. హిల్లరీ క్లింటన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఉత్తర కొరియా అధినేత కిమ్, ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ వంటి ప్రముఖులు కూడా ఈ వీడియోలో ర్యాంప్ వాక్ చేశారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ సర్వర్ క్రాష్ అయిన విషయాన్ని గుర్తుచేస్తూ ‘బ్లూ స్ర్కీన్’ కనిపించేలా ల్యాప్‌టాప్ పట్టుకుని ర్యాంప్ వాక్ చేస్తున్న బిల్ గేట్స్‌ను కూడా ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Updated Date - Jul 23 , 2024 | 05:14 AM