డాక్టర్లకు ప్రత్యేక ఐడీలు.. ఎన్‌ఎంసీ రిజిస్ట్రేషన్
ABN, Publish Date - Sep 16 , 2024 | 03:52 AM
దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులైన ఎంబీబీఎస్ డాక్టర్లందరి రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తన పోర్టర్‌లో ప్రారంభించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: దేశంలో ప్రాక్టీస్ చేయడానికి అర్హులైన ఎంబీబీఎస్ డాక్టర్లందరి రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తన పోర్టర్‌లో ప్రారంభించింది. వైద్యులకు ప్రత్యేక గుర్తింపు కార్డు కేటాయింపులో భాగంగా ఇటీవల ఎన్‌ఎంసీ ఈ పోర్టల్‌ను ఆవిష్కరించింది. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైద్యులందరూ నేషనల్ మెడికల్ రిజిస్టర్ (ఎన్‌ఎంఆర్)లో నమోదవుతారు. ఆధార్ కార్డుల ద్వారా వారి ప్రామాణికతను ధ్రువీకరిస్తారు. ఇండియన్ మెడికల్ రిజిస్టర్ (ఐఎంఆర్)లో రిజిస్టర్ అయిన ఎంబీబీఎస్ డాక్టర్లు అందరూ మరోసారి ఎన్‌ఎంఆర్, ఎన్‌ఎంసీలలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఇటీవల ఓ ప్రకటనలో తెలిపారు.
Updated Date - Sep 16 , 2024 | 03:52 AM