Bangladesh MP: ఇటువంటి హత్య జీవితంలో చూడలేదు
ABN, Publish Date - May 27 , 2024 | 07:00 PM
భారత్‌లో బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ దారుణ హత్యపై ఆ దేశ డిటెక్టివ్ చీఫ్ హరుణ్ ఆర్ రషీద్ సోమవారం కోల్‌కతాలో స్పందించారు. ఎంపీ అజీమ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. ఈ తరహా హత్య తన జీవితంలో ఇప్పటి వరకు చూడలేదని తెలిపారు.
కోల్‌కతా, మే 27: భారత్‌లో బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ దారుణ హత్యపై ఆ దేశ డిటెక్టివ్ చీఫ్ హరుణ్ ఆర్ రషీద్ సోమవారం కోల్‌కతాలో స్పందించారు. ఎంపీ అజీమ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేశారన్నారు. ఈ తరహా హత్య తన జీవితంలో ఇప్పటి వరకు చూడలేదని తెలిపారు. పక్కా ప్రణాళికతో ఇలా కూడా హత్య చేస్తారా? అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ హత్య వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ఈ రెండు దేశాల పోలీసులు కలిసి పని చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంపీ మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడెక్కడ పడేశారు.. నిందితుడిని అరెస్ట్ చేసిన క్రమాన్ని తెలుసుకోనేందుకు తాను కోల్‌కతా వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఎంపీ మృతదేహాన్ని కనుక్కోవడంలో కోల్‌కతా పోలీసులు సహాయం అందించారని ఈ సందర్భంగా హరుణ్ ఆర్ రషీద్ గుర్తు చేశారు.
Khyber Pakhtunkhwa: పాఠశాలలో అగ్నిప్రమాదం: తృటిలో తప్పించుకున్న విద్యార్థినులు
Pen Drive Videos: పోలీసులకు డేట్.. టైమ్.. చెప్పిన ప్రజ్వల్
అలాగే ఈ హత్య ఎలా జరిగిందనే దానిపై ఈ హత్య కేసులో నిందితుడితో క్రైమ్ సీన్ రీ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నామన్నారు. ఇక ఈ హత్య కేసుపై మరో బృందం బంగ్లాదేశ్‌లో పని చేస్తుందని చెప్పారు. ఆ క్రమంలో ఈ హత్యతో ప్రమేయమున్న మరో నిందితుడి కోసం గాలిస్తుందని వివరించారు. అసలు ఈ హత్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు బంగ్లాదేశ్ డిటెక్టివ్ చీఫ్ హరిన్ ఆర్ రషీద్ వెల్లడించారు.
మే 12వ తేదీన కోల్‌కతాలో చికిత్స్ కోసం బంగ్లాదేశ్ ఎంపీ అజీమ్ భారత్ చేరుకున్నారు. ఆ క్రమంలో తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్ నివాసానికి వచ్చారు. అయితే మే 13వ తేదీన వైద్య పరీక్షల కోసం ఆసుపత్రి వెళ్లిన ఎంపీ అజీమ్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గోపాల్ బిశ్వాస్.. బంగ్లాదేశ్‌లోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
LokSabha Elections: వారణాసిలో తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం
వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా ఎంపీ అజీమ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు గుర్తించారు. ఈ హత్య కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాన్ని సైతం పోలీసులు బయటకు లాగారు.
Bangalore Rave Party: హేమ ఏంటి ఈ డ్రామా..!
దీంతో ఎంపీ అజీమ్ హత్య పక్కా ప్రణాళికతోనే జరిగిందిన కోల్‌కతా పోలీసులు తేల్చేరు. ఈ నేపథ్యంలో ఈ హత్య కేసులో పాత్రదారులు, సూత్రధారులను పట్టుకొని ఈ హత్య వెనుక ఉన్న అసలు కోణాన్ని వెలికి తీసే పనిని బంగ్లాదేశ్ డిటెక్టివ్ చీఫ్ చేపట్టారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 27 , 2024 | 07:04 PM