ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భారత్‌లో కొత్త మంకీపాక్స్‌ కేసు నిర్ధారణ

ABN, Publish Date - Sep 10 , 2024 | 02:37 AM

భారత్‌లో కొత్త మంకీపాక్స్‌ కేసు నిర్ధారణ అయింది. అయితే అది క్లేడ్‌-2 రకానికి చెందిందని, కంగారుపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 9: భారత్‌లో కొత్త మంకీపాక్స్‌ కేసు నిర్ధారణ అయింది. అయితే అది క్లేడ్‌-2 రకానికి చెందిందని, కంగారుపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశాలనుంచి ఇటీవల భారత్‌కు వచ్చిన యువకుడిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్‌లో ఉంచి నమూనాలను పరీక్షించారు. మంకీపాక్స్‌ సోకిందని నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని కేంద్రం తెలిపింది. 2022 జులై నుంచి భారత్‌లో నిర్ధారణ అయిన 30 కేసుల మాదిరిగానే ఇది కూడా ఉందని వెల్లడించింది. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లేడ్‌-1 రకాన్ని ప్రపంచ ప్రజారోగ్య అత్యయిక స్థితికి కారణంగా ప్రకటించింది.

Updated Date - Sep 10 , 2024 | 02:38 AM

Advertising
Advertising