Kolkata rape-murder case: మమత ఫెయిల్యూర్ ఇది.. నిప్పులు చెరిగిన నిర్భయ తల్లి
ABN, Publish Date - Aug 17 , 2024 | 06:10 PM
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ పాశవిక అత్యాచారం, హత్య కేసుపై 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు బాధితురాలు 'నిర్భయ' తల్లి ఆశా దేవి ఘాటుగా స్పందించారు. కేసును సమర్ధవంతంగా పరిష్కరించడం, చర్యలు తీసుకోవడంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని, ఆమె తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ పాశవిక అత్యాచారం, హత్య (Kolkata rape-murder case) కేసుపై 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు బాధితురాలు 'నిర్భయ' తల్లి ఆశా దేవి (Asha Devi) ఘాటుగా స్పందించారు. కేసును సమర్ధవంతంగా పరిష్కరించడం, చర్యలు తీసుకోవడంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) విఫలమయ్యారని, ఆమె తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎంకు ఉన్న అధికారులతో తక్షణ చర్యలు తీసుకోవడానికి బదులుగా నిరసనల పేరుతో ప్రజల దృష్టి మరలిచేందుకు మమత ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు.
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ వైద్యురాలు ఆగస్టు 9న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. హత్యకు ముందు అత్యాచారానికి గురైనట్టు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఈ ఘటనపై మెడికల్ కాలేజీ విద్యార్థినులు, డాక్టర్లతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
Mamata Benerjee : ఆదివారంలోగా కేసును తేల్చేయాలి
నిర్భయ తల్లి ఏమన్నారంటే..?
మమతా బెనర్జీ స్వయంగా మహిళ అయి ఉండి, అందునా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తక్షణ కఠిన చర్యలు తీసుకుని ఉండాల్సిందని, దీనికి బదులుగా నిరసనల పేరుతో ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆశాదేవి విమర్శించారు. పరిస్థితిని హ్యాండిల్ చేయడంలో విఫలమైన మమతా బెనర్జీ రాజీనామా చేయాలన్నారు. రేపిస్టులపై కోర్టులు తక్షణ చర్యలు తీసుకునేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా కదలకుంటే దేశంలోని ఏదో ఒక చోట ప్రతిరోజూ ఇలాంటి ఘటనలే పునరావృతమవుతాయని అన్నారు. కోల్‌కతా మెడికల్ కాలేజీలో మహిళకు రక్షణ లేకపోవడం, వారిపై అత్యంత పాశవికంగా దాడులు జరుగుతుండటం చూస్తే దేశంలోని మహిళలకు ఎలాంటి భద్రత ఉందో అర్ధం చేసుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన జరిగిన మరుసటి రోజే ఈ నేరంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తిని బెంగాల్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం పోలీసు విచారణలో లోపాలని కోల్‌కతా హైకోర్టు తప్పుపడుతూ కేసును సీబీఐకి అప్పగించింది.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 17 , 2024 | 06:10 PM