ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nita Ambani: సామూహిక వివాహ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నీతా అంబానీ..

ABN, Publish Date - Jul 03 , 2024 | 01:29 PM

వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి పెద్దగా సమయం లేదు. అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌తో జూలై 12 న వివాహం జరగనుంది. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ప్రతిదీ హాట్ టాపిక్కే. నీతా అంబానీ కాశీకి వెళ్లడం నుంచి అక్కడ దేవాలయాలకు విరాళాలివ్వడం.. ఆపై పెళ్లి పత్రిక.. ఈ నేపథ్యంలో నీతా అంబానీ ధరిస్తున్న కాస్ట్యూమ్స్. ప్రతిదీ సామాన్యుడు నోరు వెళ్లబెట్టేలాగే ఉన్నాయి.

ముంబై: వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి పెద్దగా సమయం లేదు. అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌తో జూలై 12 న వివాహం జరగనుంది. ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి ప్రతిదీ హాట్ టాపిక్కే. నీతా అంబానీ కాశీకి వెళ్లడం నుంచి అక్కడ దేవాలయాలకు విరాళాలివ్వడం.. ఆపై పెళ్లి పత్రిక.. ఈ నేపథ్యంలో నీతా అంబానీ ధరిస్తున్న కాస్ట్యూమ్స్. ప్రతిదీ సామాన్యుడు నోరు వెళ్లబెట్టేలాగే ఉన్నాయి. రెండు ప్రి వెడ్డింగ్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఆ తరువాత అంబానీ కుటుంబం సామూహిక వివాహాలను జరిపించింది. దీనిలో భాగంగా 50 జంటలకు వివాహం జరిపించింది. ఈ సామూహిక వివాహ వేడుకలకు అంబానీ కుటుంబమంతా హాజరైంది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించారు.


ముఖ్యంగా నీతా అంబానీ లుక్ బాగా వైరల్ అవుతోంది. ఎరుపు రంగు బెనారస్ చీరలో ఆమె మెరిసిపోతున్నారు. అసలు నీతా అంబానీ.. తన కుమారుడు అనంత్ అంబానీ, అతనికి కాబోయే భార్య రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా నిర్వహించిన సామూహిక వివాహ వేదికపై పెళ్లికూతురికి ఏమాత్రం తీసిపోవడం లేదంటే నమ్మండి. ఆమె ఎరుపు రంగు పట్టు చీరపై పవిత్ర 'గాయత్రి మంత్రం' సైతం పల్లులో కనిపిస్తుంది. బంగారు దారాలతో రూపొందిన ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీ ఆమె చీరకు స్పెషల్ అట్రాక్షన్. నీతా చీర పల్లు.. బంగారు పక్షులతో కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. నీతా అంబానీ తను ధరించిన కాస్ట్యూమ్స్‌తో ఈవెంట్‌ను మరింత శోభాయమానంగా మార్చేశారు. ఇక ఆమె చేతికి శారీ కలర్‌తో మ్యాచ్ అయ్యేలా ఎరుపు రంగు గాజులు ధరించారు. చెవిపోగులు కూడా ఆమె ఫేస్‌కు మరింత అందాన్ని యాడ్ చేశారు. ఇక ఆమె గజ్రాతో జత చేసిన బంగారు నెక్లెస్‌‌ను ధరించారు. మొత్తంగా ఆ ఈవెంట్‌ను నీతా అంబానీ మరింత అందంగా మార్చేశారు.

Updated Date - Jul 03 , 2024 | 01:42 PM

Advertising
Advertising