Nitin Gadkari: కూలిన బ్రిడ్జి.. మాకేం సంబంధం అంటోన్న గడ్కరీ
ABN, Publish Date - Jun 19 , 2024 | 11:55 AM
బీహార్‌లో నిర్మాణం పూర్తై, ప్రారంభించాల్సిన బ్రిడ్జి కూలింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఆ ఘటనపై కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.
ఏబీఎన్ ఇంటర్నెట్: బీహార్‌లో నిర్మాణం పూర్తై, ప్రారంభించాల్సిన బ్రిడ్జి కూలింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఆ ఘటనపై కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ఆ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Also Read: ఎంపీగా ప్రియాంక గాంధీ పోటీ.. స్పందించిన రాబర్ట్ వాద్రా
ఏమన్నారంటే..?
‘ఆ బ్రిడ్జిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ నిర్మించలేదు. బీహర్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఆ బ్రిడ్జి కూలిన ఘటనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు’ అని గడ్కరీ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది.
Also Read: Rahul Gandhi Birthday: అనుమానాల నుంచి నమ్మకం వరకు.. స్ఫూర్తిదాయకం.. రాహుల్ రాజకీయ ప్రయాణం
డబుల్ ఇంజిన్ సర్కార్
‘బీహార్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ జేడీయూ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అధికారం చేపడితే అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కానీ ప్రారంభించకముందే బ్రిడ్జి కూలింది అని’ కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ బ్రిడ్జి కోసం రూ.12 కోట్లు ఖర్చు చేశారు. ప్రారంభించకముందే కూలింది. దీంతో రూ.కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది.
Updated Date - Jun 19 , 2024 | 11:55 AM