Nitish Kumar: మీ పాదాలకు మొక్కుతా... సహనం కోల్పోయిన సీఎం నితీష్

ABN, Publish Date - Jul 10 , 2024 | 02:41 PM

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపైనే సహనం కోల్పోయారు. ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్యం చేస్తారు. వారితో ముఖాముఖీ మాట్లాడుతూ ఒక్కసారిగా సీట్లోంచి లేచి చేతులు జోడించారు. ''మీరు కావాలనుకుంటే...మేము పాదాలకు మొక్కుతాం'' అంటూ నితీష్ ఒక ఇంజనీర్‌ను ఉద్దేశించి అనడంతో ఆయన తిరిగి చేతులు జోడించారు.

Nitish Kumar: మీ పాదాలకు మొక్కుతా... సహనం కోల్పోయిన సీఎం నితీష్

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపైనే సహనం కోల్పోయారు. ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్యం చేస్తారు. వారితో ముఖాముఖీ మాట్లాడుతూ ఒక్కసారిగా సీట్లోంచి లేచి చేతులు జోడించారు. ''మీరు కావాలనుకుంటే...మేము పాదాలకు మొక్కుతాం'' అంటూ నితీష్ ఒక ఇంజనీర్‌ను ఉద్దేశించి అనడంతో ఆయన తిరిగి చేతులు జోడించారు. ఆ కాసేపటికే నితీష్ శాంతించారు. ఇటీవల బీహార్‌లో డజనుకు పైగా కాజ్‌వేలు కూలిపోయిన నేపథ్యంలో నితీష్ స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.

Siddaramaiah: కర్ణాటక సీఎమ్ సిద్ధరామయ్య భార్యపై కేసు.. ముడా స్కామ్‌లో ఆమెకు సంబంధముందంటూ ఫిర్యాదు!


జేపీ గంగా పాత్‌వే (Patna Marine drive) మూడో దశను నితీష్ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రస్తుతం దిఘా నుంచి పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వరకూ 12.5 కిలోమీటర్ల పొడవునా వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు. అదనంగా మరో 4.5 కిలోమీటర్ల స్ట్రెచ్ నిర్మాణం జరుగుతోంది. ఇది పాట్నా ఘాట్ వరకూ విస్తరించడం జరుగుతోంది. దిఘా నుంచి గైఘాట్ వరకూ ట్రాఫిక్‌ను తెరవడం వల్ల ప్రజలు పాట్నా నగరానికి చేరుకోవడానికి అశోక్ రాజ్ పథ్‌లో రద్దీని నివారించవచ్చు. కాగా, గత రెండు వారాల్లోనే డజనుకు పైగా కాజ్‌వేలు కుప్పకూలడం నితీష్ కుమార్ సర్కార్‌కు తలనొప్పిగా మారింది. ఈ ఘటనల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోనప్పటికీ రాజకీయంగా దుమారం రేగడంతో ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. 15 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసి, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలను నిలిపివేసింది. శివన్, శరణ్, మధుబని, అరారియా, ఈస్ట్ చంపరాన్, కృష్ణగంజ్ జిల్లాల్లో గత 17 రోజుల్లో 10 బ్రిడ్జిలు కూలిపోయినట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. చిన్న వంతెనలు, కాజ్‌వేలు కుప్పకూలడానికి ఇంజనీర్ల నిర్లక్ష్యం, నిఘా లేమి ప్రధాన కారణాలుగా డబ్ల్యూఆర్‌డీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ చైతన్య ప్రసాద్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 10 , 2024 | 02:42 PM

Advertising
Advertising
<