ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kidnapping Case: ప్రజ్వల్ తల్లికి షాక్, అరెస్టుపై ఊహాగానాలు...

ABN, Publish Date - May 31 , 2024 | 09:17 PM

కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ కు కర్ణాటక స్థానిక కోర్టులో చుక్కెదురైంది. ఆ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది.

Prajwal Revanna Mother

బెంగళూరు: మహిళను కిడ్నాప్ చేసిన కేసు (Kidnapping Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ (Bhavani Revanna)కు కర్ణాటక స్థానిక కోర్టులో చుక్కెదురైంది. ఆ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. కిడ్నాపింగ్ కేసులో హెచ్‌డీ రేవణ్ణ, ఆయన కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణతో సహా భవానీ రేవణ్ణ పేరు కూడా ఉంది. విచారణలో పాల్గొనాల్సిందిగా భవానీ రేవణ్ణకు 'సిట్' ఇటీవల నోటీసు పంపిన క్రమంలో ఆమె ముందస్తు బెయిలుకు వెళ్లారు. ఇదే కేసులో హెచ్‌డీ రేవణ్ణకు కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది.

Prajwal Revanna: ప్రజ్వల్‌కు లైంగిక సామర్ధ్య పరీక్షలు..?


కాగా, జూన్ 1న తమ ముందు హాజరుకావాల్సిందిగా భవానీ రేవణ్ణకు 'సిట్' శుక్రవారంనాడు నోటీసు పంపింది. ఆమె విజ్ఞప్తి మేరకు హెలెనర్సిపూర్‌లోని చెన్నాంబికా నివాసంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల లోపు 'సిట్' టీమ్ ప్రశ్నించనుంది. మహిళా అధికారులతో టీమ్‌తో కలిసి తామే స్వయంగా వస్తున్నట్టు సిట్ ఆ నోటీసులో పేర్కొంది. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చడంతో విచారణ అనంతరం ఆమెను సిట్ టీమ్ అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

For Latest News and National News click here

Updated Date - May 31 , 2024 | 09:34 PM

Advertising
Advertising