Noel Tata: టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నోయెల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నిక
ABN, Publish Date - Oct 11 , 2024 | 02:39 PM
టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నోయెల్ టాటా ఎన్నికయ్యారు. నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ వైస్ చైర్మన్‌గా ఆయన ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే టాటా సన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి మరణించారు.
ముంబయి, అక్టోబర్ 11: టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నోయెల్ టాటా ఎన్నికయ్యారు. నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ వైస్ చైర్మన్‌గా ఆయన ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే టాటా సన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ రతన్ టాటా బుధవారం రాత్రి మరణించారు. దీంతో ఆయన వారసుడిగా నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఎన్నుకుంది.
Also Read: మోదీ మీరే డీల్ చేయాలి.. లేకుంటే మూడో ప్రపంచ యుద్ధమే..
Also Read: దసరా వేళ హైదరాబాద్‌లో అమ్మవారికి అవమానం
ఐదు ఖండాల్లో దాదాపు 100 దేశాల్లో ఈ సంస్థకు కంపెనీలున్నాయి. ప్రతి ఏటా భారీ ఆదాయం వస్తుంది. అందులో 66 శాతం టాటా ట్రస్ట్‌కు వెళ్లిపోతుంది. ఈ మొత్తం సేవా కార్యక్రమాలకు విరాళాల రూపంలో వెళ్లిపోతుంది. ఈ నేపథ్యంలో నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఎన్నుకుంది. అదీకాక ట్రస్ట్ బోర్డ్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నోయెల్‌ను టాటా ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఎన్నుకుంది.
Also Read: హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ.. ఎందుకంటే
Also Read: బొప్పాయి వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..?
మరోవైపు టాటా గ్రూప్ చైర్మన్‌గా ఆ సంస్థ వ్యాపారాన్ని 4 బిలియన్ల డాలర్ల నుంచి 100 బిలియన్ల డాలర్లకు రతన్ టాటా తీసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే రతన్ టాటా వివాహం చేసుకోలేదు. దాంతో ఆయన వారసుడు ఎవరనే ఓ చర్చ సైతం సాగింది.
Also Read: నేటితో ముగియనున్న మద్యం దరఖాస్తుల స్వీకరణ గడువు
అలాంటి వేళ రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ పేరు వినిపించింది. ఆయనకు ముగ్గురు పిల్లలు మాయా టాటా, నెవిల్లే టాటా, లేహ్ టాటాలు ఉన్నారు. వారు సైతం టాటా సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాటా సంస్థలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
For National News And Telugu News
Updated Date - Oct 11 , 2024 | 03:24 PM