Maharashtra: ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్
ABN, Publish Date - Aug 27 , 2024 | 01:01 PM
రత్నగిరిలో ఇంటికి వచ్చేందుకు నర్సింగ్ విద్యార్థిని ఓ ఆటో ఎక్కింది. మార్గమధ్యలో ఆటో డ్రైవర్ మాట కలిపాడు. దాహంగా ఉందని విద్యార్థిని ఆగడంతో అప్పటికే మత్తు కలిపిన వాటర్ బాటిల్ అందజేశాడు. ఆ నీటిని తాగిన విద్యార్థిని స్పృహ తప్పింది. తర్వాత యువతిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి తెగబడ్డాడు.
రత్నగిరి: కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన లైంగిక దాడి, హత్య యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. దారుణానికి ఒడిగట్టిన నిందితుడు సంజయ్ రాయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. సంజయ్‌తో మరికొందరు ఉన్నారని మృతురాలి పేరంట్స్ ఆరోపిస్తున్నారు. కోల్ కతా వైద్యురాలి హత్య తర్వాత దేశంలో చాలా చోట్ల లైంగికదాడులు జరిగాయి. మహారాష్ట్ర రత్నగిరిలో ఓ నర్సింగ్ విద్యార్థిపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి తెగబడ్డాడు.
ఆటోలో వస్తోండగా..
రత్నగిరిలో ఇంటికి వచ్చేందుకు నర్సింగ్ విద్యార్థిని ఓ ఆటో ఎక్కింది. దాహంగా ఉందని విద్యార్థిని అడగడంతో మత్తు పదార్థం కలిపిన వాటర్ బాటిల్ అందజేశాడు. నీరు తాగిన విద్యార్థిని స్పృహ తప్పింది. యువతిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. కాసేపటి తర్వాత యువతికి సృహ వచ్చింది. తర్వాత జరిగిన ఘోరం తెలిసింది. ఇంటికెళ్లిన తర్వాత జరిగన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినిపై లైంగికదాడి గురించి క్రమంగా రత్నగిరిలో అందరికి తెలిసింది.
రాస్తారోకో
పోలీసులు కేసు నమోదు చేశారే తప్ప ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రత్నగిరి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆందోళన చేస్తోన్న వారికి పోలీసులు నచ్చజెప్పి చూశారు. కానీ స్థానికులు వినిపించుకోలేదు. ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానికుల రాస్తారోకోతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాంతోపాటు రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. లైంగికదాడికి గురైన యువతి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
ఇవి కూడా చదవండి:
Jharkhand: జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్ బీజేపీలో చేరేందుకు తేదీ ఖరారు
ఖర్గే కుటుంబ సభ్యులు ఏరో స్పేస్ పారిశ్రామికవేత్తలా?
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 27 , 2024 | 02:03 PM