Omar meets LG: ఎల్జీని కలిసిన ఒమర్ అబ్దుల్లా, వచ్చేవారంలో ప్రమాణస్వీకారం
ABN, Publish Date - Oct 11 , 2024 | 09:21 PM
జమ్మూకశ్మీర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha)ను శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ఎల్జీని కోరారు. పలు పార్టీలు ఇచ్చిన మద్దతు లేఖలను ఎల్జీకి అందజేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సీట్లను సాధించింది. 42 సీట్లతో ఏకైక పెద్ద పార్టీగా ఎన్సీ నిలువగా, కాంగ్రెస్ 6, సీపీఎం ఒక స్థానంలో గెలిచింది. ఒక సీటు గెలుచుకున్న 'ఆప్' సైతం ప్రభుత్వం ఏర్పాటుకు నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ లాంఛనంగా మద్దతు లేఖను ఎన్సీకి అందజేసింది.
Sayaji Shinde: నటుడు షాయాజీ షిండే రాజకీయ అరంగేట్రం
ఎల్జీతో సమావేశానంతరం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ, ఎల్జీని కలిశామని, కాంగ్రెస్, సీపీఎం, ఆప్, ఇండిపెండెంట్లు ఇచ్చిన మద్దతు లేఖలను ఆయనకు అందజేశామని చెప్పారు. ప్రమాణస్వీకారానికి తేదీని ఖరారు చేయాలని తద్వారా ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని కోరామన్నారు. ''ఇక్కడ కేంద్ర పాలన ఉన్నందున కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు. మొదట డాక్యుమెంట్లను రాష్ట్రపతి భవన్‌కు ఎల్జీ పంపాలి. ఆ తర్వాత హోం శాఖకు వెళ్తాయి. 2 నుంచి 3 రోజులు పట్టవచ్చన్నారు. మంగళవారం కంటే ముందే ఇది పూర్తయితే బుధవారంనాడు ప్రమాణస్వీకారం ఉంటుంది'' అని ఒమర్ తెలిపారు.
For National News And Telugu News
ఇది కూడా చదవండి...
PM Modi: దసరా ఉత్సవాల వేళ.. అమ్మవారి కిరీటం చోరీ
Updated Date - Oct 11 , 2024 | 09:21 PM