ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya Ram Temple: అయోధ్యలో మోదీ...విపక్ష నేతలు ఎక్కడంటే..?

ABN, Publish Date - Jan 17 , 2024 | 04:07 PM

అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతుండగా, అదేరోజు విపక్ష పార్టీల నేతలు ప్రత్యామ్నాయ కార్యక్రమాలు ఎంచుకుంటున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండబోతున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర (Ayodhya Ram Temple) ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) హాజరవుతుండగా, ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు అందిన వారు, అందని వారి నుంచి సానుకూల, ప్రతికూల స్పందనలు వెలువడుతూనే ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం 22న అయోధ్యలో మోదీ ఉంటారు. మరి విపక్ష పార్టీల నేతలు ఎక్కడెక్కడ ఉండబోతున్నారు? ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా భావిస్తున్న ఆ పార్టీ నేతలు ఆరోజు ఏమి చేయబోతున్నారు? అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.


రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానితుల జాబితా 10,000కు పైమాటేనని చెబుతున్నారు. సొంత రాష్ట్రంలో ఈవెంట్ కావడంతో బీజేపీ నుంచి ఒక్క యూపీ ముఖ్యమంత్రికి మాత్రమే ఆహ్వానం అందింది. సీనియర్ విపక్ష నేతల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దూరంగా ఉండబోతున్నారు. విపక్ష 'ఇండియా బ్లాక్' బ్లాక్‌కు చెందిన మెజారిటీ నేతలు ఈ కార్యక్రమానికి రాజకీయ కార్యక్రమంగానే చూస్తున్నట్టు ప్రకటించారు. ఇది 'నరేంద్ర మోదీ ఫంక్షన్' అని రాహుల్ తెగేసి చెప్పగా, దీనిని మతపరంగా విభజించే ప్రయత్నంగా మమతా బెనర్జీ అభిప్రాయపడుతున్నారు.


ప్రత్నామ్నాయ ఏర్పాట్లలో విపక్ష నేతలు..

ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యావద్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ థాకరేలు అయోధ్య ఆహ్వానాన్ని తోసిపుచ్చారు. అంసపూర్తిగా ఉన్న ఆలయాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకే ప్రాణప్రతిష్ఠ తలపెట్టినట్టు వీరు విమర్శిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్టు కనిపించకుండా ఉండేందుకు 22వ తేదీనే ప్రత్యామ్నాయ ఈవెంట్లు నిర్వహించేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు.


ఎవరెవరు..ఎక్కడెక్కడ?

అయోధ్యలో 22వ తేదీన ప్రతిష్ఠాపన జరిగే రోజే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో కాళీఘట్ పర్యటన చేపడుతున్నారు. అనంతరం 'మతసామరస్య ర్యాలీ'కి సారధ్యం వహిస్తారు. మతమనేది వ్యక్తిగత అంశమని, దాన్ని రాజకీయం చేయరాదని ఆమె చెబుతున్నారు. కాగా, 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ఉన్న రాహుల్ గాంధీ 22న అసోంలో పర్యటన సాగిస్తారు. ఆరోజు కార్యక్రమంలో భాగంగా ఆయన ఆలయాలను సందర్శిస్తారు. ఇక, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్‌లు తాము అయోధ్యకు తర్వాత వెళ్తామని ప్రకటించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత అయోధ్యకు వెళ్లడం సులువుగా ఉంటుందని, అప్పటికి రామాలయ నిర్మాణం కూడా పూర్తవుతుందని శరద్ పవార్ ఆచితూచి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకూ అయోధ్య ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన ఢిల్లీ వ్యాప్తంగా 'సుందరకాండ', 'హనుమాన్ చాలీసా' కార్యక్రమాలను ప్రకటించారు.


మరోవైపు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరేకు అయోధ్య నుంచి ఆహ్వానం రాలేదు. 22వ తేదీన తాను కాలారామ్ ఆలయాన్ని దర్శించి, మహాహారతిలో పాల్గొంటారని ఆయన ప్రకటించారు. ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు కాకుండా మరోసారి ఆయోధ్యకు వెళ్తానని, ప్రాణప్రతిష్ఠకు హాజరుకాకపోవడానికి కారణంపై ట్రస్టు సభ్యుడు చంపత్ రాయ్‌కి లేఖ రాస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మళ్లించేందుకే అయోధ్య ఈవెంట్‌ను బీజేపీ హైజాక్ చేసిందని ఇప్పటికే ఆరోపించిన డీఎంకే పార్టీ 22వ తేదీ ఈవెంట్‌కు దూరంగా జరిగింది. అలాగే, మతవిశ్వాసాలను తాము గౌరవిస్తామని, కానీ మతపరమైన కార్యక్రమాలను రాజకీయం చేయడం ఇష్టపడమని వామపక్ష నేతలు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 04:07 PM

Advertising
Advertising