ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Onam Festival: ఓనం పండుగ స్పెషల్ ఏమిటో తెలుసా..

ABN, Publish Date - Sep 15 , 2024 | 10:14 AM

ఓనం పండుగలో పూజలు, ముగ్గులు, పిండి వంటలే కాదు.. సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టుకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కసావు స్టైల్ చీరకట్టుకు ఈ పండుగలో ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారు వర్ణంతో మెరిసిపోయే ఈ చీరకు..

Onam Festival

కేరళ ప్రజల ప్రీతిపాత్రమైన పండుగ అంటే వెంటనే గుర్తొచ్చేది ఓనం పండుగ. తెలంగాణలో బతుకమ్మ, బోనాలు, ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి, తమిళనాడులో దీపావళి ఎంత ప్రసిద్ది చెందాయో.. ఓనం కేరళ సంస్కృతికి ప్రతీక. అక్కడి సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయనికి ముడిపడిన పండుగే ఓనం. ఇది కేరళలోని వ్యవసాయ పండుగ. సెప్టెంబర్ నెలలో వచ్చే ఈ పండుగను పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటుంటారు. ఇక ఈ పండుగను కేరళ ప్రజలే కాకుండా.. తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ఉండే మళయాళీ ప్రజలు ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు. సెప్టెంబర్6వ తేదీన ప్రారంభమైన పండుగ ఈరోజు ముగుస్తుంది. ఓనం సందర్భంగా కేరళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. ఏనుగుల స్వారీలు, తెల్లటి దుస్తుల్లో మగువలు, రకరకాల పూలతో సుందరంగా చేసిన అలంకరణలు ఎంతగానో ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా ఆడపిల్లలు రకరకాల పువ్వులను సేకరించి వాటితో ఇంటి ముందు అందమైన ముగ్గు వేసి ఆ మధ్యలో దీపం వెలిగిస్తారు. దీన్ని మలయాళంలో పూక్కలం అంటారు. ఓనం సందర్భంగా కేరళలో రంగవల్లులపై పోటీలు నిర్వహిస్తారు. ఈ పండుగ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఈ విందులో సాధారణంగా అరటి ఆకులపై పలు రకాల ఆహార పదార్థాలు వడ్డిస్తారు. సంప్రదాయ పచ్చళ్లు, అప్పడాలు, పాయసం, పప్పు, అన్నంతోపాటు రకరకాల పిండివంటలను చేసుకుని కుటుంబమంతా కలిసి భుజిస్తారు.


ఓనం స్పెషల్ చీర కట్టు..

ఓనం పండుగలో పూజలు, ముగ్గులు, పిండి వంటలే కాదు.. సంప్రదాయబద్ధమైన కట్టూబొట్టుకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కసావు స్టైల్ చీరకట్టుకు ఈ పండుగలో ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారు వర్ణంతో మెరిసిపోయే ఈ చీరకు రంగురంగుల డిజైనర్ బ్లౌజుల్ని జతచేసి బుట్టబొమ్మల్లా మెరిసిపోతుంటారు కేరళ మహిళలు. ఈరోజు తిరుఓనంతో ఈ వేడుకలు ముగుస్తాయి.


సౌభ్రాతృత్వానికి ప్రతీక..

ఓనం పండుగ సౌభ్రాతృత్వానికి, సౌభాగ్యానికి, ఐక్యతకు చిహ్నం. కుల, మత భేదం లేకుండా ఈ పండుగను జరుపుకుంటారు. ఓనం సందర్భంగా కేరళలో సాంప్రదాయ తుల్లల్ అనే జానపద నృత్యం, కథకళి వంటి సాంప్రదాయ నృత్యరీతులతో కూడిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకగా జరుగుతాయి. ఓనం సందర్భంగా కేరళలో జరిగే పడవ పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Sep 15 , 2024 | 10:14 AM

Advertising
Advertising