ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ooty: పట్టాలు తప్పిన ఊటీ కొండరైలు..

ABN, Publish Date - Feb 27 , 2024 | 11:28 AM

ఊటీ కొండరైలు ఫెర్న్‌హిల్‌ వద్ద పట్టాలు తప్పింది. రైలులోని ప్రయాణికులకు ఎలాంటి ముప్పువాటిల్లలేదు. మేట్టుపాళయం నుంచి ఊటీకి 220 మంది ప్రయాణికులతో

చెన్నై: ఊటీ కొండరైలు ఫెర్న్‌హిల్‌ వద్ద పట్టాలు తప్పింది. రైలులోని ప్రయాణికులకు ఎలాంటి ముప్పువాటిల్లలేదు. మేట్టుపాళయం నుంచి ఊటీకి 220 మంది ప్రయాణికులతో సోమవారం ఉదయం వస్తుండగా ఊటీ రైల్వే స్టేషన్‌(Ooty Railway Station)కు కిలోమీటర్‌ దూరంలో ఫెర్న్‌హిల్‌ వద్ద పట్టాలు తప్పింది. ఆ ప్రాంతం వద్ద ఉన్నట్టుండి తోడా గిరిజనులు పెంచుతున్న బర్రెలు పట్టాలకు అడ్డంగా రావడంతో రైలింజన్‌ డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేశారు. దీనితో ఆ రైలింజన్‌ను ఆనుకుని ఉన్న బోగీ పట్టాలు తప్పింది. ఈ సమాచారం అందుకున్న రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని ప్రయాణికులను వివిధ వాహనాల్లో ఊటీకి తరలించారు. రైల్వే ఇంజనీరింగ్‌ నిపుణులు బోగీని భారీ క్రేన్‌ల సాయంతో పట్టాలపైకి ఎక్కించే పనులు ప్రారంభించారు. ఈ సంఘటన కారణంగా మేట్టుపాళయం - ఊటీ మార్గంలో ఇరువైపులా రైలు సేవలను రద్దు చేశారు.

Updated Date - Feb 27 , 2024 | 11:28 AM

Advertising
Advertising