ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!

ABN, Publish Date - Feb 28 , 2024 | 03:55 AM

రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ‘ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌’గా పేరు మార్చిన ప్యాసింజర్‌ రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీ చార్జీలను మంగళవారం నుంచి పునరుద్ధరించింది.

Ordinary fares again in those trains

ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌’గా పేరు మార్చిన

ప్యాసింజర్‌ రైళ్లలో చార్జీల తగ్గింపు

కనీస చార్జీ రూ.30 నుంచి రూ.10కి!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ‘ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌’గా పేరు మార్చిన ప్యాసింజర్‌ రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీ చార్జీలను మంగళవారం నుంచి పునరుద్ధరించింది. దీంతో ఆ రైళ్లలో టికెట్‌ చార్జీలు 50ు వరకు తగ్గాయి. లాక్‌డౌన్‌ తర్వాత రైల్వే శాఖ ప్యాసింజర్‌ రైళ్ల పేరును ‘ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌’గా మారుస్తూ వచ్చింది. కొత్త పేరు ఆధారంగా చార్జీలు వసూలు చేస్తూ ఆర్డినరీ చార్జీలకు చెల్లుచీటీ చెప్పింది. దీంతో కనీస టికెట్‌ ధర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సమానంగా రూ.10 నుంచి రూ.30కు పెరిగింది. అదే రైలు.. అదే వేగం.. కేవలం పేరు మార్చి రైల్వే శాఖ ప్రయాణికులపై, ముఖ్యంగా చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, పేదలపై భారం వేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సోమవారం రైల్వే బోర్డు సమీక్షా సమావేశం నిర్వహించి.. మంగళవారం అర్ధరాత్రి నుంచి పాత చార్జీలనే వసూలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు పంపింది.

Updated Date - Feb 28 , 2024 | 08:48 AM

Advertising
Advertising