Terrorism: సరిహద్దు ఉగ్రవాద శిబిరాలకు పాక్ నిధులు.. యాక్టివ్ టెర్రరిస్ట్ క్యాంపుల లిస్ట్ విడుదల
ABN, Publish Date - Jul 17 , 2024 | 10:45 AM
పీఓకే సరిహద్దులో ఈ మధ్య కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అయితే ఉగ్రవాద శిబిరాల జాబితాను సిద్ధం చేస్తున్న తరుణంలో భారత ఆర్మీ విచారణలో కీలక విషయాలు బయటకి వచ్చాయి. సరిహద్దులో ఉన్న టెర్రరిస్టు శిబిరాలకు పాకిస్థాన్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నట్లు తేలింది.
ఢిల్లీ: పీఓకే సరిహద్దులో ఈ మధ్య కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అయితే ఉగ్రవాద శిబిరాల జాబితాను సిద్ధం చేస్తున్న తరుణంలో భారత ఆర్మీ విచారణలో కీలక విషయాలు బయటకి వచ్చాయి. సరిహద్దులో ఉన్న టెర్రరిస్టు శిబిరాలకు పాకిస్థాన్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నట్లు తేలింది. జూలై 16న కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిపిన కాల్పుల్లో ఒక అధికారితో సహా నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు.
కతువా జిల్లాలోని రిమోట్ మాచెడి అటవీ ప్రాంతంలో ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఆగ్రహించిన భారత ఆర్మీ.. వారి మూలాలను వెతికే పనిలో పడింది. ఈ క్రమంలో పాక్ నిధుల వ్యవహారం బయటకి వచ్చింది.
ఉగ్రవాదుల కార్యకలాపాలు..
శిక్షణ పొందిన ఉగ్రవాదులను, మాజీ ఎస్‌ఎస్‌జీ (స్పెషల్ సర్వీస్ గ్రూప్) సభ్యులు, కిరాయి సైనికులకు పాకిస్థాన్ ఒక్కో గ్రూపునకు కనీసం రూ.లక్ష ఇచ్చి.. భారత్‌కు పంపుతోందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ ఈ ఉగ్రవాదులకు M4 రైఫిల్స్, చైనీస్ కవచాలను ఛేదించే బుల్లెట్ల వంటి ఖరీదైన ఆయుధాలను సమకూర్చుతోంది. చొరబాటు సమయంలో వారికి సహాయపడే వారికి రూ.10 వేల నుండి రూ.50 వేల వరకు చెల్లింస్తున్నారు. ఉగ్రవాదులు Icom రేడియో సెట్ల ద్వారా Samsung ఫోన్‌లు, Y SMSలను ఉపయోగిస్తున్నట్లు తేలింది.
కంచెలు, సొరంగాల తనిఖీలు
పాకిస్తాన్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు భారతలోకి చొరబడటానికి అంతర్జాతీయ సరిహద్దు లేదా ఇతర మార్గాలను ఉపయోగించుకున్నారు. BSF అన్ని కంచెలు, సొరంగాలను తనిఖీ చేస్తోంది. దేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు ఆహారం, ఇతర అవసరాలకు సహాయం చేసే ఓవర్ గ్రౌండ్ వర్కర్లకు (OGWs) రూ.5 వేలు-6 వేల వరకు అందజేస్తున్నట్లు తేలింది. ఈ ఉగ్రవాదులకు పాక్ సైన్యం సహాయంతో దాయాది దేశంలో శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఉగ్రవాదుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారట. పాకిస్థాన్ తన ఉగ్రవాద శిబిరాలను తిరిగి యాక్టివేట్ చేసినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. యువతను ఉగ్రదాడులవైపు పూర్తిగా మళ్లించడంలో విఫలమైన పాక్.. ఇప్పుడు వారికి డబ్బు ఎరగా వేసి ఆకర్షించే పనిలో పడింది.
యాక్టివ్ ఉగ్రవాద శిబిరాలు...
నికియల్
జాండ్రుట్
ఖురెట్టా
కోట్లి
సమాని
అబ్దుల్ బిన్ మసూద్
సమన్
కోట్ కొటేరా
For Latest News and National News click here
Updated Date - Jul 17 , 2024 | 10:45 AM