Supreme Court: 'నీట్' పేపర్ లీకైన మాట నిజం, దర్యాప్తు జరపాల్సిందే...
ABN, Publish Date - Jul 08 , 2024 | 06:32 PM
నీట్ యూజీ 2024 పరీక్షల్లో అక్రమాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేపరు లీకైన విషయం నిజమని, దీనిపై ప్యానల్ తప్పనిసరిగా విచారణ జరపాలని స్పష్టం చేసింది. 23 లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశం అయినందున 'నీట్ రీటెస్ట్'ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని తెలిపింది.
న్యూఢిల్లీ: నీట్ యూజీ 2024 (NEET UG 2024) పరీక్షల్లో అక్రమాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేపరు లీకైన విషయం నిజమని, దీనిపై ప్యానల్ తప్పనిసరిగా విచారణ జరపాలని స్పష్టం చేసింది. 23 లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశం అయినందున 'నీట్ రీటెస్ట్'ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని తెలిపింది. లీకైన పేపరు ఎంతమందికి చేరిందో తేల్చాల్సి ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) ఝస్టిస్ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్లపై సీజేఐ బెంచ్ సోమవారంనాడు విచారణ జరిపింది.
వరుస ప్రశ్నలు సంధించిన ధర్మాసనం
ఈ సందర్భంగా కేంద్రం, ఎన్‌టీఏపై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్‌కు ఎలా పంపించారు? ప్రిటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా పంపారు? ఏ తేదీలతో ఈ ప్రక్రియ జరిగింది? లీకైన పేపరు ఎంతమందికి చేరింది? ఎలా చేరింది? లీకేజీతో లబ్ధి పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎంతమంది విద్యార్థుల ఫలితాలను విత్‌హోల్డ్‌లో ఉంచారు? వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరాగలని ధర్మాసనం పేర్కొంది. అక్రమార్కులను గుర్తించకపోతే తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరో మార్గం లేదని తెలిపింది.
Supreme Court: నెలసరి సెలవులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. వాటిని కోల్పోతారన్న ధర్మాసనం
మరోసారి అఫిడవిట్ దాఖలు చేయండి..
విచారణ సందర్భంగా ఒకే సెంటర్‌లో పేపర్ లీక్ అయిందని ప్రభుత్వం, పరీక్షకు మూడు గంలకు ముందు పేపర్ లీక్ అయిందని ఎన్‌టీఏ కోర్టుకు విన్నవించాయి. లోపాలను పగిగట్టేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని ఈ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై మరోసారి అఫిడవిట్ దాఖాలు చేయాలని కేంద్రం, సీబీఐ, ఎన్‌టీఏను ధర్మాసనం ఆదేశించింది. జూలై 10వ తేదీలోగా అఫిడవిట్ దాఖలను చేయాలని స్పష్టం చేసింది. నీట్ లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్‌ను అందించాలని సీబీఐని ఆదేశించింది. 67 మందికి 720 మార్కులు ఎలా వచ్చాయో విచారమ చేయాలని, ఎక్కడ పేపర్ లీకేజీ జరిగింది, పరీక్షా సమయం కంటే ఎన్ని గంటల ముందు పేపర్ లీక్ అయింది, పేపర్ ఎలా లీక్ అయ్యిందో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎన్‌టీఏను ఆదేశించింది. అనంతరం నీట్ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.
For Latest News and National News click here
Updated Date - Jul 08 , 2024 | 06:36 PM