ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Paper Leak case: పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్‌పర్సన్‌ను తొలగించిన యోగి

ABN, Publish Date - Mar 05 , 2024 | 03:08 PM

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ కేసులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు చైర్‌పర్సన్‌ రేణుకా మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ (constable recruitment examination) పేపర్ లీకేజీ కేసులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు చైర్‌పర్సన్‌ రేణుకా మిశ్రా (Renuka Mishra)ను ఆ పదవి నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆమెను వెయింటింగ్ లిస్ట్‌లో ఉంచారు. విజిలెన్స్ డైరెక్టర్ రాజీవ్ కృష్ణకు బోర్డు అదనపు బాధ్యతులు అప్పగించారు.


రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గత ఫిబ్రవరి 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే, పేపర్ లీకేజీ ఆరోపణలు వెల్లువత్తడంతో ఫిబ్రవరి 24న పరీక్షలను రద్దు చేస్తున్నట్టు యోగి సర్కార్ ప్రకటించిది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించడంతో పాటు ఆరు నెలల్లోగా తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. పేపరు లీకేజీ ఆరోపణలపై దర్యాప్తు బాధ్యతను స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్)కు అప్పగిస్తామన్నారు. యూపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు 48 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు.

Updated Date - Mar 05 , 2024 | 03:14 PM

Advertising
Advertising