ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parliament Session: బడ్జెట్ సమావేశాలు ఒకరోజు పొడిగించే అవకాశం..

ABN, First Publish Date - 2024-02-06T17:57:36+05:30

ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను మరొక రోజు అదనంగా పొడిగించే అవకాశం ఉంది. అయితే, దీనికి ఇతమిద్ధమైన కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న ప్రారంభమైన 10 రోజుల బడ్జెట్ సమావేశాలు ఈనెల 9వ తేదీతో ముగియనున్నాయి. అయితే, వచ్చే శనివారం (10వ తేదీ) వరకూ సమావేశాలను పొడిగించే విషయంపై చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను (Parlimanet Session) మరొక రోజు అదనంగా పొడిగించే అవకాశం ఉంది. అయితే, దీనికి ఇతమిద్ధమైన కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. షెడ్యూల్ ప్రకారం జనవరి 31న ప్రారంభమైన 10 రోజుల బడ్జెట్ సమావేశాలు ఈనెల 9వ తేదీతో ముగియనున్నాయి. అయితే, వచ్చే శనివారం (10వ తేదీ) వరకూ సమావేశాలను పొడిగించే విషయంపై చర్చ జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.


జేకే స్థానిక సంస్థల్లో ఓబీసీ కోటా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కాగా, జమ్మూకశ్మీర్‌లోని స్థానిక సంస్థల్లో ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) రిజర్వేషన్ కల్పించే బిల్లుకు లోక్‌సభ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. 2019లో 370వ అధికరణను రద్దు చేసినప్పటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతంలో కీలక మార్పులు చేపట్టినట్టు ప్రభుత్వం చెప్పింది. జమ్మూకశ్మీర్ స్థానిక సంస్థల చట్టం (సవరణ) బిల్లు-2024పై చర్చకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిస్తూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల ఫలితాలు కేంద్రపాలిత ప్రాంత ప్రజలు చవిచూస్తున్నారని చెప్పారు. కాగా, జమ్మూకశ్మీర్‌లోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును ఉద్దేశించారు.

Updated Date - 2024-02-06T18:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising