ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Parliament winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు..

ABN, Publish Date - Nov 05 , 2024 | 06:00 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు అయింది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా ప్రకటించారు.

Parliament

Parliament winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు అయింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన తేదీలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగం ఆమోదం పొందిన 75వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శీతాకాల సమావేశాల్లో 'ఒకే దేశం, ఒకే ఎన్నికల' ప్రతిపాదనతోపాటు వక్ఫ్(సవరణ) బిల్లు - 2024పై అధికార, విపక్షల మధ్య వాడివేడిగా చర్చ జరగవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కారణంగా పార్లమెంట్ సమావేశాలపై ఎంతో ఆసక్తి నెలకొంది.


వన్ నేషన్ - వన్ ఎలక్షన్:

'వన్ నేషన్ - వన్ ఎలక్షన్' అంటే దేశంలోని ఓటర్లు అందరూ లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఓకేసారి ఓటు హక్కును వినియోగించుకోవడం. అయితే, ఇలా చేయడం వల్ల ప్రాంతీయ పార్టీలు ఉండవు. ఈ కారణంగానే జమిలి ఎన్నికలను ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమెదం తెలిపింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమెదం తెలిపింది.


వక్ఫ్ సవరణ బిల్లు:

వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కానీ ఎక్కువ పార్టీలు ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. అందుకే వక్ఫ్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. అయితే, వక్ఫ్ బిల్లుపై ముస్లిం వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా ఈ బిల్లు ఉందని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.


Also Read:

ఐదుగురు రెబల్స్‌పై ఉద్ధవ్ థాకరే వేటు

ఎన్నికల్లో పోటీపై శరద్ పవార్ సంచలన ప్రకటన

మదర్సాలపై కీలక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..

For More National and telugu News

Updated Date - Nov 05 , 2024 | 06:04 PM