ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chirag Paswan: కులగణన మంచిదే... కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సంచలన వ్యాఖ్య

ABN, Publish Date - Jul 20 , 2024 | 07:45 PM

దేశవ్యాప్తంగా కులగణన జరగాలంటూ ప్రతిపక్షాలు కొద్దికాలంగా చేస్తున్న డిమాండ్‌పై కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ చీప్ చిరాగ్ పాశ్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులగణన అవసరమేనని అన్నారు. అయితే ఇది సమాజ విభజనకు దారితీస్తుందని, నిర్దిష్ట డాటాను బహిర్గతం చేయరాదని హెచ్చరించారు.

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కులగణన (Caste Census) జరగాలంటూ ప్రతిపక్షాలు కొద్దికాలంగా చేస్తున్న డిమాండ్‌పై కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ (LJP) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులగణన అవసరమేనని అన్నారు. అయితే ఇది సమాజ విభజనకు దారితీస్తుందని, నిర్దిష్ట డాటాను బహిర్గతం చేయరాదని హెచ్చరించారు. కమ్యూనిటీ ఆధారిత అభివృద్ధి పథకాలకు నిధులు కేటాయించాలంటే నిర్దిష్ట డాటా అవసరమవుతుందని, అయితే కులగణన ద్వారా సమాజంలో విభజన ఏర్పడే అవకాశాలు ఉన్నందున ఆ డాటాను ప్రభుత్వం వద్ద ఉంచాలని, బహిర్గతం చేయకూడదని అన్నారు. జమిలి ఎన్నికల(Simultaneous polls)పై కానీ, ఉమ్మడి పౌర స్మృతి (UCC)పై కానీ ఎన్డీయే ప్రభుత్వంలో ఇప్పటి వరకూ ఎలాంటి చర్చజరగలేదని వివరించారు. జమిలి ఎన్నికలు, యూసీసీ అమలు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నాయి.

Amit Shah: ల్యాండ్ జీహాద్, లవ్ జీహాద్‌ను ప్రోత్సహిస్తున్న సోరెన్‌.. అమిత్‌‌షా నిప్పులు


యూసీసీకి సంబంధించిన తనకు కొన్ని ఆందోళనలు ఉన్నాయని 'పీటీఐ' వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమైనందున ముసాయిదా ప్రతి తన ముందుకు వచ్చేంత వరకూ తాను దీనిపై ఒక నిశ్చితాభిప్రాయనికి రాలేనని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో కొందరు ఆదివాసీలు దీనికి దూరంగా ఉంటారని, వారందరినీ ఒకే గొడుకు కిందకు తీసుకురాగలమా? అనేదే ప్రశ్న అని అన్నారు. అయితే, జమిలి ఎన్నికల కాన్సెప్ట్‌కు ఎల్‌జేపీ బలంగా మద్దతిస్తుందని తెలిపారు.

For More National News and Telugu News..

Updated Date - Jul 20 , 2024 | 07:45 PM

Advertising
Advertising
<