ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Patanjali: సుప్రీంకోర్టులో పతంజలి రాందేవ్ బాబాకు ఎదురుదెబ్బ

ABN, Publish Date - Apr 10 , 2024 | 01:32 PM

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో పతంజలి రాందేవ్ బాబాకు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. కరోనిల్ ప్రచారంపై రాందేవ్ బాబా రెండోసారి చెప్పిన క్షమాపణపైనా సుప్రీం ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలకు రాందేవ్ బాబా సిద్ధంగా ఉండాలని న్యాయస్థానం హెచ్చరించింది.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court)లో పతంజలి (Patanjali) రాందేవ్ బాబా (Ramdev Baba)కు బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. కరోనిల్ (Coronel) ప్రచారంపై రాందేవ్ బాబా రెండోసారి చెప్పిన క్షమాపణ (Apology)పైనా సుప్రీం ధర్మాసనం అసంతృప్తి (unsatisfied) వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలకు రాందేవ్ బాబా సిద్ధంగా ఉండాలని న్యాయస్థానం హెచ్చరించింది. పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన కరోనిల్‌పై రాందేవ్ బాబా తప్పుడు వ్యాపార ప్రకటనలు ఇచ్చారు. దీంతో పతంజలి ఆయుర్వేద ఔషదాలపై తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో రాందేవ్ బాబా, ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ (Balakrishna)కు సుప్రీం కోర్టు గతంలో నోటీసులు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రాందేవ్ బాబా, బాలకృష్ణ క్షమాపణలు చెప్పారు.


గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మళ్లీ తప్పుడు ప్రకటనలు ఇచ్చినందుకు రాందేవ్ బాబా, బాలకృష్ణలపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనిల్‌ను కరోనా వైరస్‌కు విరుగుడుగా ప్రచారం చేయడంపై పతంజలి సంస్థను గతంలో హెచ్చరించినట్లు బుధవారం న్యాయస్థానంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రాందేవ్ బాబా, బాలకృష్ణలు రెండు సార్లు క్షమాపణలు చెప్పినా ధర్మాసనం సంతృప్తి చెందలేదు. కోర్టు ధిక్కరణ చర్యలకు సిద్దంగా ఉండాలని బుధవారం ఇద్దరినీ సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది.

Updated Date - Apr 10 , 2024 | 01:34 PM

Advertising
Advertising