Bangladesh MP Murder: చర్మాన్ని వలిచి, ముక్కలుగా నరికి.. బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసులో సంచలన నిజాలు!
ABN, Publish Date - May 24 , 2024 | 12:53 PM
బంగ్లాదేశ్ ఎంపీ మహ్మద్ అన్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చికిత్స కోసం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా వచ్చిన ఎంపీ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ఓ వలసదారుడిని కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ (Anwarul Azim Anar) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చికిత్స కోసం బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి కోల్‌కతా (Kolkata) వచ్చిన ఎంపీ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ఓ వలసదారుడిని కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ హత్య చేసే క్రమంలో నిందితులు దారుణంగా ప్రవర్తించినట్టు వార్తలు బయటకు వస్తున్నాయి. ఓ మహిళను ఉపయోగించి ఆ ఎంపీని హనీట్రాప్ చేసినట్టు తెలుస్తోంది (Bangladesh MP Murder).
అన్వర్ హత్య కేసులో సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారుతున్నాయి. అన్వర్ స్నేహితుడు అయిన కోల్‌కతా వాసి ప్రస్తుతతం అమెరికాలో నివాసం ఉంటున్నారు. అతడికి కోల్‌కతాలోని టౌన్‌హాల్‌లో ఓ అపార్ట్‌మెంట్ ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లిన అన్వర్ తిరిగి బయటకు రాలేదు. నిందితులు ఓ మహిళను ఉపయోగించి హనీ ట్రాప్ చేయించి అన్వర్‌ను ఆ అపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిన వెంటనే అన్వర్‌ను నిందితులు హత్య చేశారు. హత్య అనంతరం మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో నిందితులు దారుణంగా వ్యవహరించారు.
``ఎంపీని గొంతు నులిమి చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. చర్మాన్ని వలిచేశారు. దుర్వాసన రాకుండా శరీర భాగాలకు పసుపు రాశారు. కొన్ని భాగాలను ఫ్రిడ్జ్‌లో ఉంచారు. ఇతర భాగాలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి వివిధ ప్రదేశాల్లో పడేసి ఉంటారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన జిహాద్ హవల్దార్ ఈ హత్యలో కీలక నిందితుడు`` అని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్ సంతతికి చెందిన అమెరికా పౌరుడు అఖ్తర్ జమాన్ సూచన మేరకే తాను ఈ హత్య చేసినట్టు నిందితుడు హవల్దార్ అంగీకరించినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Dinesh Karthik: ఆ సమయంలో కార్తీక్ చేసిన సహాయం మరువలేనన్న కోహ్లీ.. కన్నీళ్లు పెట్టుకున్న దీపిక..!
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 24 , 2024 | 12:56 PM