ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: ఫలితాలపై ఆందోళన లేదు, మోదీతోనే జనం: జేపీ నడ్డా

ABN, Publish Date - Jun 01 , 2024 | 02:43 PM

లోక్‌సభ చివరి విడత ఎన్నికల పోలింగ్ ఘట్టం శనివారం సాయంత్రంతో ముగుస్తుండగా, ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎలాంటి ఆందోళన చెందడం లేదని, దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే ఉన్నారని చెప్పారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ చివరి విడత ఎన్నికల పోలింగ్ ఘట్టం శనివారం సాయంత్రంతో ముగుస్తుండగా, ఎన్నికల ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎలాంటి ఆందోళన చెందడం లేదని, దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తోనే ఉన్నారని చెప్పారు. దేశంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడే అవకాశాలపైనా ఆయన తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.


400 సీట్లు పైమాటే..

జూన్ 4న తేదీన కొత్త ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని నడ్డా తెలిపారు. బీజేపీ 370కు పైగా సీట్లు గెలుస్తుందని, ఎన్డీయేకు 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మోదీ తప్పనసరి అని ప్రజలు అవగాహన చేసుకున్నారని, ఈ విషయంలో తమకెలాంటి ఆందోళన లేదని, విపక్షాల నిజస్వరూపాన్ని ప్రజల ముందుచామని చెప్పారు. ఛింద్వారా సీటుతో సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని అన్ని సీట్లూ తాము గెలుస్తామని, హర్యానాలోనూ ఈసారి స్వీపింగ్ చేస్తామని, రాజస్థాన్‌లో మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు. 2019 కంటే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు.

Lok Sabha Elections: మోదీ బాటలోనే..


దక్షిణాదిలో రికార్డులు బ్రేక్..

దక్షిణాది రాష్ట్రాల్లోనూ బీజేపీ అన్ని రికార్డులను బద్ధలు కొట్టనుందని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రెండంకెల స్థాయికి చేరుతామన్నారు. తమిళనాడులో గణనీయంగా ఓట్ షేర్ పెరగనుందని, గెలుపు దిశగా పయనిస్తున్నామని చెప్పారు. కేరళ నుంచి కూడా తమ ఎంపీ అభ్యర్థులు గెలుస్తారని అన్నారు.

For Latest News and National News click here

Updated Date - Jun 01 , 2024 | 02:45 PM

Advertising
Advertising