ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: ‘బతికుండగానే కాదు.. చనిపోయిన తర్వాత దోచుకుంటుంది’

ABN, Publish Date - Apr 24 , 2024 | 01:41 PM

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరో సారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆస్తిగా భావించిన వారు.. ఆ పార్టీని తమ పిల్లలకు వంశపారంపర్యంగా ఇచ్చారంటూ సోనియా గాంధీ కుటుంబంపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శించారు. కానీ భారతీయులు మాత్రం తమ వంశపారం పర్యంగా వచ్చిన ఆస్తిని.. వారి పిల్లలకు చెందకుండా ప్రయత్నం చేస్తుందంటూ ఆ పార్టీపై మండిపడ్డారు.

PM Modi

ఛత్తీస్‌గఢ్, ఏప్రిల్ 24: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మరో సారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తమ ఆస్తిగా భావించిన వారు.. ఆ పార్టీని తమ పిల్లలకు వంశపారంపర్యంగా ఇచ్చారంటూ సోనియా గాంధీ కుటుంబంపై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శించారు. కానీ భారతీయులు మాత్రం తమ వంశపారం పర్యంగా వచ్చిన ఆస్తిని.. వారి పిల్లలకు చెందకుండా ప్రయత్నం చేస్తుందంటూ ఆ పార్టీపై మండిపడ్డారు.

CPI: మనసులో మర్మాన్ని బయటపెట్టిన సీఎం జగన్: రామకృష్ణ

ఎన్నికల ప్రచారంలోభాగంగా బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుగుజాలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ప్రజల సంపదపై సర్వే నిర్వహిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై అధిక పన్నులు భారం మోపడం ద్వారా.. వారి పిల్లలకు ఆస్తుల లేకుండా చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు.

సోనియా గాంధీ కుటుంబానికి సలహాదారు శ్యామ్ పిట్రోడ్ (Sam Pitroda).. గతంలో మధ్య తరగతి ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేయాలని సూచించారని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. వంశపారంపర్య పన్ను విధానాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ చూస్తుందని మండిపడ్డారు. మీరు మీ పిల్లలు కోసం కష్టపడి సంపాదించిన సంపాదనను.. వారికి కాకుండా చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుందో.. శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యల ద్వారా బహిర్గమైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రం ఒక్కటే.. ప్రజలు బతికుండగానే కాదు.. వారు చనిపోయిన తర్వాత కూడా వారిని దోచుకోవడమే ఆ పార్టీ ప్రధాన ఉద్దేశ్యమని మోదీ పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ ఆరోపణల్లో ఎక్కడా గాంధీ కుటుంబం పేరు ప్రస్తావించకుండా ఈ ఆరోపణలు గుప్పించారు.

Hyderabad: భగ్గుమన్న భానుడు.. బంజారాహిల్స్‏లో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

మరోవైపు ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా.. తాజాగా అమెరికాలో అమలవుతున్న వంశపారంపర్య విధానాన్ని భారత్‌లో అమలు చేయాలని అభిప్రాయపడ్డారు. అంటే ఓ వ్యక్తికి 100 శాతం ఆస్తిలో 55 శాతం ప్రభుత్వం తీసుకుని.. తిరిగి ప్రజల కోసం వినియోగిస్తుంది.

PM Modi: ఆ రంగంలో పెట్టుబడులు పెట్టండి.. ప్రధాని మోదీ కీలక సూచనలు

అంటే.. తాము సంపాదించిన ఆస్తిలో 45 శాతం మాత్రం తమ పిల్లలు అందుతుంది. అయితే శ్యామ్ పిట్రోడా అభిప్రాయంపై సర్వత్ర తీవ్ర దుమారం చెలరేగింది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అయితే శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను అధికార బీజేపీ ఓ ఆయుధంగా మలచుకొని.. కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడికి దిగింది.

Read National News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 01:46 PM

Advertising
Advertising