PM Modi: కాంగ్రెస్ 20 ఏళ్లలో చేసేది.. 5 ఏళ్లలో చేసి చూపించాం.. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ
ABN, Publish Date - Mar 09 , 2024 | 03:39 PM
20 ఏళ్లలో కాంగ్రెస్(Congress) చేసే పనులను తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసి చూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. శనివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఇటానగర్: 20 ఏళ్లలో కాంగ్రెస్(Congress) చేసే పనులను తమ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసి చూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. శనివారం ఆయన అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు చేయడానికి కాంగ్రెస్‌కు రెండు దశాబ్దాలు పట్టేదని ఎద్దేవా చేశారు.
రూ.55,600 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టుల ఆవిష్కరణ తరువాత ఆయన ఇటానగర్‌లో మాట్లాడుతూ.. "ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులతో ఈశాన్య భారతం వాణిజ్యం, పర్యాటక రంగాల్లో దూసుకుపోనుంది. దక్షిణ, తూర్పు ఆసియాలతో ఈ ప్రాంతానికి సంబంధాలు బలపడనున్నాయి. కాంగ్రెస్ నేతలు ఇక్కడ పర్యటించి మేం చేసిన అభివృద్ధి చూడాలి. నేను హామీ ఇచ్చాక అమలు చేయడానికి ఎంత దూరం వెళ్తానో ప్రజలకు తెలుసు. ఓ వైపు దేశాభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడుతుంటే విపక్ష ఇండియా కూటమి నేతలు నాపై ఎదురుదాడి చేస్తున్నారు" అని మోదీ అన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 09 , 2024 | 03:41 PM