మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: రాహుల్ శక్తి వ్యాఖ్యలకు మోదీ ఘాటు కౌంటర్

ABN, Publish Date - Mar 18 , 2024 | 02:42 PM

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ) చేసిన 'శక్తి' వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూటిగా స్పందించారు. 'ఇండి' కూటమి సవాలును తాను స్వీకరిస్తున్నానని అన్నారు. ప్రతి తల్లి తనకు శక్తి రూపమేనని అన్నారు. తెలంగాణలోని జగిత్యాలలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు.

PM Modi: రాహుల్ శక్తి వ్యాఖ్యలకు మోదీ ఘాటు కౌంటర్

జగిత్యాల: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన 'శక్తి' (Shakti) వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సూటిగా స్పందించారు. 'ఇండి' కూటమి సవాలును తాను స్వీకరిస్తున్నానని అన్నారు. ప్రతి తల్లి తనకు శక్తి రూపమేనని అన్నారు. తెలంగాణ (Telangana) లోని జగిత్యాల (Jagtial)లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, తమ పోరాటం శక్తితోనేనంటూ 'ఇండి' కూటమి చెబుతోందని, తన వరకూ ప్రతి తల్లి, చెల్లి, కూతురు అంతా శక్తిస్వరూపాలేనని, శక్తి రూపంలో వారిని ఆరాధిస్తానని, తాను భరతమాత ఆరాధకుడినని చెప్పారు. ఈ శక్తిని అంతం చేస్తామంటూ 'ఇండి' కూటమి సవాలును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.


రాహుల్ ఏమన్నారు?

ముంబైలో ఆదివారం జరిగిన 'భారత్ జోడో న్యాయయాత్ర' ముగింపు సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, మోదీపై పోరాటం వ్యక్తిగతం కాదన్నారు. శక్తి(అధికారం)కి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని, ఇక్కడ శక్తి అంటే ఏమిటనే ప్రశ్న ఉందని అన్నారు. రాజు (మోదీ) ఆత్మ ఈవీఎంలు, ఈడీ, సీబీఐ, ఆదాయం పన్ను సంస్థల్లో ఉందని, అవి లేకుండా గెలవలేరని విమర్శించారు.

Updated Date - Mar 18 , 2024 | 02:42 PM

Advertising
Advertising