ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఈసారి 400 సీట్లు దాటొచ్చు.. ఖర్గే వీడియో వైరల్

ABN, Publish Date - Feb 02 , 2024 | 05:27 PM

కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారంనాడు పార్లమెంటులో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ 'అబ్ కీ బార్, 400 పార్' అంటూ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అధికార పార్టీ సభ్యుల్లో నవ్వులు వెల్లివిరిసాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం చిరునవ్వులు చిందించారు.

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారంనాడు పార్లమెంటులో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) బీజేపీని పరోక్షంగా ప్రస్తావిస్తూ 'అబ్ కీ బార్, 400 పార్' అంటూ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అధికార పార్టీ సభ్యుల్లో నవ్వులు వెల్లివిరిసాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం చిరునవ్వులు చిందించారు. ఇందుకు సంబధించిన వీడియో 'క్లిప్‌'ను బీజేపీ అధికారికి 'ఎక్స్' ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అవుతోంది.


"మీకు 330-334 సీట్లతో మెజారిటీ ఉంది. ఈసారి, అది 400కు పైనే కావొచ్చు'' అంటూ ఖర్గే పేర్కొనడం ఈ వీడియో క్లిప్‌లో కనిపిస్తోంది. 2019లో 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలుచుకోవాలని టార్గెట్‌‌గా పెట్టుకుంది. ఎన్డీయే ప్రభుత్వం సాధించిన విజయాలను హైలైట్ చేస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఇప్పటికే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Updated Date - Feb 02 , 2024 | 05:27 PM

Advertising
Advertising