Mann Ki Baath: నేడు ప్రధాని మోదీ మన్ కీ బాత్
ABN, Publish Date - Jun 30 , 2024 | 08:05 AM
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తారు. దీన్ని అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేస్తారు. మూడోసారి ప్రధాని భాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా మోదీ మన్ కీ బాత్ పేరిట ప్రసారమాధ్యమాల ద్వారా ప్రసంగిస్తారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ (Mann Ki Baath) కార్యక్రమం (Program) నిర్వహిస్తారు. దీన్ని అన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేస్తారు. మూడోసారి ప్రధాని భాధ్యతలు చేపట్టిన తరువాత తొలి సారిగా మోదీ మన్ కీ బాత్ పేరిట ప్రసారమాధ్యమాల ద్వారా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో ప్రజలకు వినిపించేలా బీజేపీ నేతలు (BJP Leaders) ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ ‘మనకి బాత్’ కార్యక్రమాన్ని అన్ని శక్తి’ కేంద్రాల్లో వినిపించే ఏర్పాట్లు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 వేల శక్తి కేంద్రాల్లో ఈ ఏర్పాట్లను చేయాలని జిల్లా నేతలకు ఆమె సూచించారు.
అలాగే మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతీ శక్తి కేంద్రంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబును దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తిరిగి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభిస్తున్నారని తెలిపారు. మన్ కీ బాత్‌లో ప్రజలతో మాట్లాడతారని చెప్పారు.
జూలై 8వ తేదీన రాష్ట్ర స్ధాయి బీజేపీ విస్తృత కార్యవర్గం సమావేశం నిర్వహిస్తున్నట్లు పురందేశ్వరి వెల్లడించారు. ఎన్నికల అనంతరం విస్తృత కార్యవర్గ సమావేశం రాజమహేంద్రవరంలో ఒక రోజు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. మండల అధ్యక్షులతో సహా జిల్లాలో బాధ్యతలు ఉన్నవారు ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. పార్టీ అనుబంధ మోర్చాలు , ఇతర బాధ్యతలు ఉన్నవారు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని సరోవర్ కన్వెన్షన్ హాల్లో ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశ్వ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
కప్పు దరిచేరె.. విజేతగా వీడ్కోలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jun 30 , 2024 | 08:06 AM