ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: రాష్ట్రాలతో కలిసి పని చేస్తాం!

ABN, Publish Date - Jun 05 , 2024 | 05:46 AM

అధికారంలో ఏ పార్టీ ఉన్నదన్న దాంతో సంబంధం లేకుండా.. దేశాభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. తమ మూడో దఫా పాలనలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించటంపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు.

  • పార్టీలకతీతంగా దేశాభివృద్ధికి కృషి.. రాజ్యాంగమే మనకు దిశా నిర్దేశం

  • బీజేపీ శ్రేణులతో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): అధికారంలో ఏ పార్టీ ఉన్నదన్న దాంతో సంబంధం లేకుండా.. దేశాభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు. తమ మూడో దఫా పాలనలో అవినీతిని కూకటివేళ్లతో పెకిలించటంపై దృష్టి పెడతామని స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం బీజేపీ కేంద్రకార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. జై జగన్నాథ్‌ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ఆ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో ఎన్‌డీఏపై ప్రజలు వరుసగా మూడోసారి నమ్మకం ఉంచారని, ఇది వికసిత్‌ భారత్‌కు లభించిన విజయమని పేర్కొన్నారు. ఒకే వ్యక్తి సారథ్యంలో వరుసగా మూడు పర్యాయాలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 1962 తర్వాత ఇదే తొలిసారని మోదీ తెలిపారు. భవిష్యత్‌ కార్యాచరణను వెల్లడిస్తూ.. ‘దేశ రాజ్యాంగమే మాకు దిశానిర్దేశం చేస్తుంది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలచటానికి అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తాం. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీలు అధికారంలో ఉన్నాయన్న దాంతో సంబంధం లేకుండా ఈ కృషి కొనసాగిస్తాం. మరిన్ని భారీ నిర్ణయాలు కూడా ఉంటాయి’ అని మోదీ పేర్కొన్నారు. ఎలకా్ట్రనిక్స్‌, సెమీకండక్టర్స్‌, రక్షణ, తయారీ రంగాల్లో శీఘ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, రైతులు స్వయంసమృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గ్రీన్‌ ఇండస్ట్రియలైౖజేషన్‌లో పెట్టుబడులను పెంచుతామన్నారు. దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మార్చేందుకు పనిచేస్తామన్నారు. ప్రపంచసవాళ్లను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.


  • మంచి పనులు కొనసాగిస్తాం

ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గి సొంత మెజారిటీ లభించని విషయాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించలేదు. అయితే మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలో పార్టీకి లభించిన విజయాల్ని ప్రస్తుతించారు.

ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, కేరళలో ఖాతా తెరిచిందని, తెలంగాణలో గతంలోకన్నా రెట్టింపు సీట్లు సాధించిందని గుర్తు చేశారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు, బిహార్‌లో జేడీయూ చీఫ్‌ నితీ్‌షకుమార్‌ అధ్వర్యంలో ఎన్‌డీఏ కూటమి అద్భుత ఫలితాలను సాధించిందన్నారు. దశాబ్దం కాలంగా చేస్తున్న మంచి పనులను కొనసాగిస్తామని, ప్రజల కలలను సాకారం చేయడానికి కృషి చేస్తామన్నారు. బీజేపీ గెలుపుకు కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 05 , 2024 | 05:48 AM

Advertising
Advertising